Begin typing your search above and press return to search.

క్రికెటర్ అవతారం ఎత్తుతున్న అక్కినేని హీరో

By:  Tupaki Desk   |   19 Jun 2018 5:43 AM GMT
క్రికెటర్ అవతారం ఎత్తుతున్న అక్కినేని హీరో
X
అక్కినేని నాగచైతన్య ఇప్పుడు తనకు స్ట్రెంగ్త్ ఉన్న జోనర్ లోనే సినిమాలు చేస్తున్నాడు. లవ్ స్టోరీస్ విషయంలో చైతును బాగా ఇష్టపడతారు ఆడియన్స్. కానీ చెయ్ కి మాత్రం మాస్ మూవీస్ అంటే మక్కువ. అందుకే మధ్యమధ్యలో అవకాశం వచ్చినపుడు ప్రయోగాలు చేస్తుంటాడు కానీ.. అవన్నీ నిరుత్సాహపరిచాయి.

దీంతో తన సేఫ్ జోనర్ లోనే మూవీస్ చేస్తున్నాడు చైతు. అయితే.. ఇప్పుడు చైతుకు పర్సనల్ గా నచ్చిన మరో జోనర్ లో సినిమా చేసే అవకాశం వచ్చింది. అదే స్పోర్ట్స్ డ్రామా. నానితో నిన్ను కోరి అంటూ మంచి హిట్ సాధించిన శివ నిర్వాణ డైరెక్షన్ లో చైతు- సమంత కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చెయ్ ఓ క్రికెటర్ పాత్రలో కనిపించబోతున్నాడట. తన పర్సనల్ ఇష్టాలను ఈ హీరో అంతగా బయటకు చెప్పడు కానీ.. ఇతడికి క్రికెట్ అంటే బాగా మక్కువ ఎక్కువ. క్రికెట్ ను తెగ ప్రేమించే ఈ హీరోకు.. క్రికెటర్ రోల్ ఆఫర్ చేయడంతోనే వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది.

సమంతతో కలిసి చేస్తున్న ఈ మూవీ ఫ్యామిలీ డ్రామా అయినా సరే.. క్రికెట్ తో లింక్ ఎక్కువగానే ఉంటుందట. హీరో కేరక్టర్ అంతా ఆ గేమ్ చుట్టూనే తిరుగుతూ ఎమోషన్స్ పండించేలా ఉంటుందని అంటున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. చాలాకాలం తర్వాత వీరిద్దరూ జంటగా నటిస్తుండడంతో.. ట్రేడ్ జనాల్లో ఈ ప్రాజెక్టుపై ఆసక్తి బాగానే కనిపిస్తోంది.