Begin typing your search above and press return to search.

రెండు లుక్స్ ఇస్తానంటున్న చైతు

By:  Tupaki Desk   |   28 March 2017 5:50 PM GMT
రెండు లుక్స్ ఇస్తానంటున్న చైతు
X
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న కొత్త సినిమాకి.. ఉగాది పండుగ సందర్భంగా ఫస్ట్ ఇవ్వాలని డిసైడ్ చేశారు. పండుగ రోజున అభిమానులను అలరించేందుకు ఫస్ట్ లుక్ ఇప్పటికే సిద్ధం చేసేశారు కూడా. అయితే.. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ లుక్ విషయంలో దర్శక నిర్మాతల మధ్య తేడాలు వచ్చేశాయట.

సోగ్గాడే చిన్ని నాయన ఫేం దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో.. నాగ చైతన్య-రకుల్ ప్రీత్ సింగ్ జోడీగా కొత్త సినిమా రూపొందుతోంది. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. ఉగాది ఫస్ట్ లుక్ విషయంలో వీళ్లిద్దరూ ఓ క్లారిటీకి రాలేకపోయారట. అందుకే డైరెక్టర్ టేస్ట్ కు తగ్గట్లుగా ఒకటి.. నిర్మాత అభీష్టానికి అనుగుణంగా మరొకటి ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేయాలని డిసైడ్ చేశారు. ఈ విషయాన్ని చైతు స్వయంగా చెప్పడం విశేషం.

ఈ చిత్రానికి 'రా రండోయ్ వేడుక చూద్దాం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నాడట దర్శకుడు. ఇప్పటికే ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా చేసేయడంతో.. ఇదే పేరును పండుగ రోజున ఫస్ట్ లుక్ సందర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/