మజిలీ తర్వాత మూడు సెట్ చేసిన చైతు!

Mon Mar 25 2019 10:55:10 GMT+0530 (IST)

అక్కినేని నాగచైతన్య ఈ మధ్య వరస పరాజయాలతో అభిమానులను  కాస్త నిరాశపరిచి ఉండొచ్చు కానీ కొత్త సినిమాలను లైన్లో పెట్టడంలో మాత్రం జోరు చూపిస్తున్నాడు.  చైతు కొత్త సినిమా 'మజిలీ' ఏప్రిల్ 5 న విడుదల కానుంది.  ఈ సినిమాను పక్కన పెడితే మొత్తం మూడు సినిమాలు రెడీ అవుతున్నాయి.మేనమామ వెంకటేష్ తో కలిసి నటిస్తున్న 'వెంకీమామ' ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.  ఈ చిత్రానికి బాబీ దర్శకుడు.  ఈ సినిమా తర్వాత మేర్లపాక గాంధి దర్శకత్వంలో ఒక సినిమాకు రీసెంట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.  'వెంకీమామ' షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం.  దీంతో పాటుగా చైతు కోసం సీనియర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఒక కథ తయారు చేస్తున్నారు.  ఎఎన్నార్ క్లాసిక్ 'దేవదాసు' సినిమా ఆధారంగా మోడరన్ టచ్ ఇస్తూ చైతు కోసం ఒక ట్రాజెడీ కథను వండుతున్నారట.  ఈ సినిమాకు ఇంకా దర్శకుడిని ఫైనలైజ్ చెయ్యలేదు.  

ఈలెక్కన.. 'మజిలీ'  తర్వాత టోటల్ గా మూడు ప్రాజెక్టులు లైన్లో ఉన్నట్టు.  టాలీవుడ్ లో ఏ హీరోకు కూడా ఇలాంటి మూడు నాలుగు సినిమాల లైనప్ లేదు.  అందరూ అఖిల్ ను స్పీడ్ అంటారు కానీ అదేం లేదు.. చైతు కనపడడు కానీ యమా స్పీడే!