అన్నయ్య చోటా రాజన్.. అల్లు అరవింద్ దావూద్ ఇబ్రహీం : నాగబాబు

Tue Feb 12 2019 16:26:21 GMT+0530 (IST)

గత రెండు నెలలుగా నాగబాబు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నారు. ఇంటర్వ్యూలు పొలిటికల్ కామెంట్స్ అంటూ నాగబాబు మీడియాలో ప్రముఖంగా నిలుస్తున్నాడు. తన యూట్యూబ్ ఛానెల్ లో నాగబాబు పొలిటికల్ పంచ్ లు వేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తాజాగా మరోసారి నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సమస్యలన్నింటి గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో ఉన్న సమస్యల గురించి ఎందుకు స్పందించడం లేదు అంటూ కొందరు చాలా కాలంగా ప్రశ్నిస్తున్నారు. ఇండస్ట్రీలో ఆయనకు సంబంధించిన వారు ఉన్నారు కనుక పవన్ మౌనంగా ఉంటున్నాడా అంటూ ఆరోపణలు చేస్తున్నారు.తన తమ్ముడిపై వస్తున్న ఆ ఆరోపణలపై నాగబాబు స్పందించాడు... తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ సురేష్ బాబు ఫ్యామిలీ లు ఒక వైపు దిల్ రాజు అల్లు అరవింద్ గారు సురేష్ బాబు వీళ్లకంటే పెద్ద మాఫియా ఎవరు ఉంటారు. మేమే పెద్ద మాఫియా అల్లు అరవింద్ గారు ఒక దావూద్ ఇబ్రహీం అయితే మా అన్నయ్య చిరంజీవి గారు చోటా రాజన్ అన్నయ్య కాకుంటే సురేష్ బాబు చోటా రాజన్ అంటూ అసహనపు వ్యాఖ్యలు చేశాడు.

ఇండస్ట్రీలో ఆ నలుగురు అంటూ చేస్తున్న ఆరోపణలు పిచ్చి ఆరోపణలు. ఒక మంచి సినిమాను ఎవరు కంట్రోల్ చేయలేరు చిన్న సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రాకుంటే తప్పు వీరిది ఎందుకు అవుతుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తారతమ్యం ఏమీ ఉండదని ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా లాభాలు ఇచ్చే సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసేందుకు చూస్తాడని చిన్న సినిమాల్లో కంటెంట్ ఉంటే తప్పకుండా సినిమా ఆడుతుందని దానికి మాఫియా అంటూ పెద్ద పెద్ద మాటలు వాడుతారు ఎందుకు అని దీంట్లో పవన్ కళ్యాణ్ స్పందించడానికి ఏముంటుందంటూ నాగబాబు తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.