మహేష్ గురించి నాగబాబు కామెంట్స్

Mon Dec 10 2018 12:45:41 GMT+0530 (IST)

నాగబాబు చాలా ముక్కుసూటితనంతో మాట్లాడే వ్యక్తి. ఆయన కొన్ని సార్లు మాట్లాడే మాటలు వివాదాన్ని కూడా సృష్టించిన విషయం తెల్సిందే. ఆవేశంతో మాట్లాడతాడని కూడా నాగబాబు గురించి అంతా అనుకుంటారు. అలాంటి నాగబాబు తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాల గురించి పలువురు సినీ ప్రముఖుల గురించి మాట్లాడటం జరిగింది. ఆ సమయంలోనే ఒక అభిమాని మహేష్ గురించి ఒక్క లైన్ లో కామెంట్ చేయాల్సిందిగా నాగబాబును కోరడం జరిగింది.మహేష్ బాబు గురించి నాగబాబు మాట్లాడుతూ... మహేష్ గురించి ఒక్క మాట ఏంటి ఎంత సేపైనా మాట్లాడొచ్చు. తమ్ముడు పవన్ కళ్యాణ్ కు సమానమైన క్రేజ్ ఉన్న వ్యక్తి. వివాదాలకు పూర్తిగా దూరంగా ఉండే వ్యక్తి. తండ్రి వారసత్వంకు తగ్గట్లుగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న వ్యక్తి. తన భార్య వయస్సు వారు మహేష్ ను తమ్ముడిలా భావిస్తారు - ఇక ఈ తరం అమ్మాయిలు అతడిని డ్రీమ్ బాయ్ గా చూస్తారు. ప్రిన్స్ అనే పదానికి అతడు పూర్తిగా అర్హుడు అన్నాడు.

నాగబాబు కామెంట్స్ కు మహేష్ బాబు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మహేష్ బాబు గురించి పాజిటివ్ గా మాట్లాడినందుకు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు చెబుతూ ఆ వీడియోను షేర్ చేస్తున్నారు. నాగబాబు ఇంకా ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలపై స్పందించాడు. కొన్ని విషయాలపై వివాదాస్పదంగా కూడా మాట్లాడాడు. మొత్తానికి నాగబాబుకు మహేష్ పై చాలా అభిమానం ఉందని ఈ ఇంటర్వ్యూ ద్వారా వెళ్లడయ్యింది.