Begin typing your search above and press return to search.

అవన్నీ ఉత్తి మాటలు.. డబ్బే ముఖ్యం

By:  Tupaki Desk   |   25 Jun 2019 9:11 AM GMT
అవన్నీ ఉత్తి మాటలు.. డబ్బే ముఖ్యం
X
జబర్దస్త్‌ జడ్జ్‌ నాగబాబు తన సొంత యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా అప్పుడప్పుడు అభిమానులను పలకరిస్తూ ఉంటాడు. తాజాగా కొందరు అభిమానులు అడిగిన ప్రశ్నలకు నాగబాబు సమాధానాలు చెప్పాడు. ఆ సందర్బంగా డబ్బు గురించి సుదీర్ఘంగా నాగబాబు మాట్లాడటం జరిగింది. జీవితంలో డబ్బు చాలా ముఖ్యం అని.. డబ్బు లేకుంటే బలం లేనట్లే అంటూ నాగబాబు డబ్బు విలువను చెప్పే ప్రయత్నం చేశాడు.

నాగబాబు మాట్లాడుతూ... మోటరు వాహనం నడవాలంటే ఇంధనం కావాలి అలాగే జీవితం అనే బండి నడవాలి అంటే ధనం కావాలి. మనిషికి మానవత్వం.. మంచి వ్యక్తిత్వం ఉండాలని అప్పుడే గౌరవం వస్తుందని కొందరు అంటూ ఉంటారు. అవన్ని ఉత్తి మాటలే. మనిషికి అన్నింటి కంటే ముఖ్యంగా డబ్బు అవసరం చాలా ఉంది. దానిని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటేనే సంతోషంగా ఉంటారని నాగబాబు చెప్పుకొచ్చాడు.

డబ్బు లేక ఇబ్బంది పడ్డ సందర్బాలు నాకు ఉన్నాయి. నా 49వ సంవత్సరంలో డబ్బు విలువ తెలిసి వచ్చింది. అప్పటి నుండి బాగానే సంపాదించాను పొదుపు చేశాను. అంతకు ముందు కూడా డబ్బును దుర్వినియోగం చేయలేదు. కాని అప్పుడు నాకు డబ్బు సంపాదించాలన్న కసి మాత్రం లేదు. ఎప్పుడైతే డబ్బులు లేక ఇబ్బంది కలిగిందో అప్పుడే నాలో కసి మొదలైంది. అప్పటి నుండి బాగా సంపాదించాను అది వేరే విషయం.

ఉద్యోగంలో చేరిన మొదటి నుండే డబ్బు సంపాదన మొదలు పెట్టి పొదుపు చేసుకోవాలని నాగబాబు సూచించాడు. డబ్బు సంపాదించాలనే కసి కలగాలి అంటే 'ది రిచ్చెస్ట్‌ మ్యాన్‌ ఇన్‌ బాబిలాన్‌' పుస్తకం చదవాలని నాగబాబు సూచించాడు. ఆ పుస్తకంలో డబ్బు అవసరం ఎంత ఉంది.. అది లేకపోతే పరిస్థితి ఏంటీ అనే విషయాలను చక్కగా చెప్పడం జరిగిందన్నాడు. సంపాదనలో కనీసం 10 శాతం అయినా పొదుపు చేసుకోవాలని ఆ పుస్తకం చెబుతుంది. డబ్బు ఎంత పొదుపు చేస్తే అంత బలంగా తయారవ్వొచ్చు అంటూ నాగబాబు చెప్పుకొచ్చాడు.