Begin typing your search above and press return to search.

ఫేక్ అకౌంట్ గురించి నాగ్ క్లారిటీ

By:  Tupaki Desk   |   15 Jun 2019 9:10 AM GMT
ఫేక్ అకౌంట్ గురించి నాగ్ క్లారిటీ
X
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సెలబ్రిటీలకు ఫేక్ అకౌంట్ల బెడద తప్పడం లేదు. మిలియన్ల కొద్దీ ఫాలోయింగ్ వచ్చే అవకాశం ఉండటంతో ఎవరో గుర్తు తెలియని కొందరు ఆగంతకులు హీరో హీరోయిన్ల పేరు మీద ఐడి క్రియేట్ చేసి అసలు వాళ్లకు పెద్ద తలనెప్పి తెచ్చి పెడుతున్నారు. ఈ బాధ కింగ్ నాగార్జునకూ తప్పలేదు. ఇప్పటిదాకా నాగ్ కు కేవలం రెండు ప్లాట్ ఫార్మ్స్ లో మాత్రమే అకౌంట్స్ ఉన్నాయి.

ట్విట్టర్ లో అత్యధికంగా 6 మిలియన్లకు పైగా ఫాలోయర్స్ ఉండగా ఫేస్ బుక్ లో సైతం 2 మిలియన్లకు పైగా కొనసాగుతున్నారు. తన సినిమాలకు సంబంధించినవి మాత్రమే కాక ఫామిలీ పిక్స్ కూడా ఎప్పటికప్పుడు నాగ్ పోస్ట్ చేస్తూనే ఉంటాడు. ఇదంతా ఓకే కానీ నాగ్ కు బాగా పాపులర్ అయిన ఇన్స్ టాగ్రామ్ లో మాత్రం ఖాతా లేదు

ఇది గుర్తించిన ఓ అపరిచితుడు వెంటనే ఓ ఫేక్ అకౌంట్ సృష్టించేసి అందులో నాగ్ ఫోటోలు వీడియోలు పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఇది నిజమని నమ్మిన అభిమానులు సినిమా ప్రేమికులు ఫాలో కావడం మొదలుపెట్టారు. నెంబర్ అంతకంతా పెరుగుతూ పోవడంతో ఇది ఏకంగా నాగ్ దృష్టికే వెళ్ళింది. వెంటనే అలెర్ట్ అయిన నాగ్ సదరు ఐడి అడ్రెస్ ని ట్విట్టర్ లో పోస్తూ చేస్తూ ఇది నేను కాదని ఇన్స్ టాలోకి వచ్చినప్పుడు అందరికి తెలియపరుస్తానని క్లారిటీ ఇచ్చాడు. సో అలా ఫేక్ అకౌంట్ కథ కాశీకి చేరిందన్న మాట