Begin typing your search above and press return to search.

ఎస్వీఆర్.. సూర్యకాంతంలు కావలెను

By:  Tupaki Desk   |   27 Sep 2016 7:30 AM GMT
ఎస్వీఆర్.. సూర్యకాంతంలు కావలెను
X
కుర్ర డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ప్రెస్టీజియస్ ప్రాజెక్టు మహానటిని ప్రారంభించేందుకు అంతా సిద్ధం చేసేసుకుంటున్నాడు. ఎవడే సుబ్రమణ్యంతో ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందిన ఈ దర్శకుడు.. రెండో ప్రయత్నంలోనే మహానటి సావిత్రిపై బయోపిక్ కి రెడీ అయిపోయాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తయిపోగా.. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా సూపర్ ఫాస్ట్ గా జరిగిపోతున్నాయి.

మహానటి సావిత్రి పాత్రలో నటించేందుకు ట్యాలెంటెడ్ బ్యూటీ నిత్యా మీనన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. స్క్రిప్ట్ విపరీతంగా నచ్చేయడంతో.. సింగిల్ సిట్టింగ్ లోనే మహానటి ప్రాజెక్టుకు ఈమె సైన్ చేసేందుకు అంగీకరించేసింది. మరి ఆ తరం మహానటిపై సినిమా అంటే.. సమకాలికులు అయిన ఇతర మహానటులను కూడా చూపించాలి. ఇప్పటికే ఎన్టీఆర్ పాత్రను జూనియర్ తోను.. ఏఎన్నార్ రోల్ ని నాగచైతన్యతోను చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రాజెక్టుకి ప్రొడ్యూసర్ అశ్వనీదత్ కాబట్టి.. వీరితో సై అనిపించడం పెద్ద కష్టం కాకపోవచ్చని అంటున్నారు. మరోవైపు ఎంజీఆర్.. శివాజీ గణేశన్ ల పాత్రల కోసం తమిళ నటులను వెతుకుతున్నారు.

కానీ నాగ్ అశ్విన్ కి.. ఎస్వీఆర్-సూర్యకాంతం పాత్రల దగ్గరే చిక్కు వచ్చి పడింది. వీరిని రెప్లికేట్ చేయగల నటులెవ్వరూ ఇప్పటి తరంలో లేరనే విషయం తెలిసిందే. అందుకే వీరికోసం వెదుకులాట మొదలైంది. ఈ ఇద్దరు మహానటుల కేరక్టర్లను పోషించే వాళ్లు దొరికితే.. ఇక మహానటి సెట్స్ పైకి వెళ్లిపోనుందని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/