అప్పుడే భారీ హీరోయిజం ఎందుకు బాసూ!!

Thu Apr 20 2017 17:52:37 GMT+0530 (IST)

ప్రొడ్యూసర్ పుత్రరత్నాలకు హీరో అవ్వడం తేలికైన విషయమే. కాకపోతే వీళ్ళు రెండో సినిమాకే మెగాస్టార్ చిరంజీవి రేంజ్ హీరోయిజమ్.. మహేష్ బాబు లా డైనమిజం చూపించేద్దాం అనుకుంటారు. అక్కడే బెడసి కొడుతుంటుంది. అప్పట్లో పాపులర్ ప్రొడ్యూసర్.. సిందూరపువ్వు కృష్ణారెడ్డి కొడుకు.. నాగ అన్వేష్.. ఈ మధ్యనే ''వినవయ్యా రామయ్యా'' అనే సినిమాతో హీరో అయిపోయాడు.

ఇప్పుడు ''ఏంజెల్'' అనే సినిమాతో వస్తున్నాడు ఈ కుర్రాడు. టీజర్ చూస్తే.. అబ్బో మనోడ్ని ఒక 'ట్రాన్స్ పోర్టర్' సినిమా హీరో రేంజులో.. ఏదన్నా వస్తువును ట్రాఫికింగ్ చేయాలంటే పెద్ద ఎక్స్ పర్ట్ అన్న తరహాలో ఇచ్చే బిల్డప్ లు ఉన్నాయి చూడండి.. వామ్మో పిచ్చ పీక్స్ అంతే. గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ కోసం హరీశ్ శంకర్ కూడా ఈ రేంజు బిల్డప్పులు ఇచ్చుండడు. పైగా హీరో పక్కనే మరో కమెడియన్ సైడ్ కిక్.. మనోడు హీరో వేసే పంచులకు షాకవ్వడం.. హీరోకోసం ఇంకాస్త బిల్డప్పివడం.. కాస్త ఓవర్ గానే ఉంది.

నిజానికి యాక్టింగ్ వచ్చు అన్నట్లు ఓ రెండు మూడు సినిమాలతో ప్రూవ్ చేసుకుని.. కాస్త డిపెండబుల్ హీరో అనిపించుకుని.. ఆడియన్స్ లో క్రేజ్ పెంచుకుని.. అప్పుడు ఇలాంటి మాస్ అవతారాలు ఎత్తితే ఉపయోగం ఉంటుంది. అసలు రెండు పెద్ద హిట్లు కొట్టిన నాగ శౌర్య.. సుధీర్ బాబు వంటి హీరోలు కూడా మాస్ రోల్ చేస్తే ఆడియన్స్ తిరస్కరిస్తున్న టైములో.. సాయికుమార్ కొడుకు ఆది.. సందీప్ కిషన్ వంటి హీరోల మాస్ సినిమాలన్నీ దారుణంగా ఫ్లాపవుతున్న టైములో.. నాగ అన్వేష్ ఇలా ఒక మాస్ రోల్ ఎంచుకోవడం.. పెద్ద మైనస్సనే చెప్పాలి.

ఇకపోతే మరోసారి హెబ్బా పటేల్ అందాలను 'ఏంజెల్' పేరుతో కత్తిలాగా వాడేసుకున్నారని అర్ధమవుతోందిలే. కాకపోతే ఈ మధ్యన హెబ్బా అందాలకు కూడా డిమాండ్ తగ్గిపోయింది. ఆమెకు కూడా ఫ్లాపులు తగిలేస్తున్నాయి. చూద్దాం ఏమవుతుందో!!Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/