Begin typing your search above and press return to search.

మాస్ రాజా సరసన సిరి (సాఫ్ట్ వేర్ ఇంజనీర్)?

By:  Tupaki Desk   |   22 Sep 2018 8:35 AM GMT
మాస్ రాజా సరసన సిరి (సాఫ్ట్ వేర్ ఇంజనీర్)?
X
నిన్న విడుదలైన నన్ను దోచుకుందువటేలో గలగలా మాట్లాడుతూ అల్లరి చేసే పాత్రలో మెప్పించిన నభా నటేష్ కు మెల్లగా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విశేషాల్లో సిరి కం మేఘనగా నభా నటేష్ ఇచ్చిన పెర్ఫార్మన్స్ ఆడియన్స్ తో భేష్ అనిపించుకుంది. స్వతహాగా కన్నడ భామ ఆయిన నభా నటేష్ అక్కడ కూడా ఇప్పటిదాకా కేవలం రెండు సినిమాల్లోనే నటించింది. అందులో అగ్ర హీరో శివ రాజ్ కుమార్ సరసన చేసిన వజ్రకాయ హిట్ అయినప్పటికీ ఎక్కువ అవకాశాలు రాలేదు. నన్ను దోచుకుందువటే సైన్ చేయడానికి ముందే రవిబాబు అదుగో పూర్తి చేసిన నభా నటేష్ నెల రోజుల గ్యాప్ లోనే అది కూడా విడుదల కాబోతుండటం పట్ల హ్యాపీగా ఉంది. గట్టిగా కష్టపడితే హీరోయిన్ల కొరత ఉన్న టాలీవుడ్ లో గట్టిగా సెటిల్ అవ్వొచ్చనే ప్లాన్ లో ఉన్నట్టుంది. ఎలాగూ తన కొలీగ్ రష్మిక మందన్న ఆఫర్ల వర్షంలో తడిసిపోతోంది. తనకూ అలాంటి హిట్ దొరికితే అంతకంటే కావాల్సింది ఏముంది.

తాజా అప్ డేట్ ప్రకారం నభా నటేష్ కు రవితేజ కొత్త సినిమాలో ఛాన్స్ వచ్చే అవకాశం ఉన్నట్టు టాక్. ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేమ్ విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో నభా నటేష్ నే ఆప్షన్ గా చూస్తున్నారట. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఫైనల్ కావొచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. సీనియర్ హీరో అందులోనూ మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న రవితేజ తో చేస్తే బాగానే వర్క్ అవుట్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ హిట్ అయితేనేలెండి. తను ఓకే చెప్పిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఐదేళ్ల క్రితం ఫెమినా మిస్ ఇండియా టాప్ 10 కంటెస్టెంట్స్ లో ఉన్న నభా నటేష్ కు కెరీర్ లో బ్రేక్ రావడానికి ఐదేళ్లు పట్టింది. ఇది కూడా ఓకే అయ్యిందంటే మెల్లగా కుదురుకోవచ్చు. నభా నటేష్ బాల్యం నుంచి విద్యాభ్యాసం దాకా అన్ని కర్ణాటకలోనే సాగాయి. తెలుగు సినిమాల కోసం ఇప్పుడు హైదరాబాద్ లోనే ఎక్కువ మకామట.