Begin typing your search above and press return to search.

మొన్న రష్మిక.. ఈ రోజు నభా!

By:  Tupaki Desk   |   21 Sep 2018 4:20 PM GMT
మొన్న రష్మిక.. ఈ రోజు నభా!
X
కొద్దినెలల క్రితం తెలుగులో మలయాళ బ్యూటీలు వరసగా ఎంట్రీ ఇచ్చారు. మలయాళం బ్యూటీలు దాడి తగ్గిందనుకునేలోపు ఈసారి కన్నడ బ్యూటీల సందడి మొదలైంది. ఇప్పటికే రష్మిక మందన్న 'ఛలో'.. 'గీత గోవిందం' సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా మారింది. ఇక త్వరలో టాప్ హీరోయిన్స్ లీగ్ లో ఎంట్రీ ఇవ్వడం కూడా ఖాయమే. రష్మిక పరిస్థితి ఇలా ఉంటే తాజాగా మరో కన్నడ సుందరి నభా నటేష్ 'నన్ను దోచుకుందువటే' సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో మొదలయింది.

ఈ సినిమా లో సుధీర్ బాబుకు జోడీగా నటించిన నభా నటేష్ కు తెలుగులో ఇది మొదటి సినిమా. అయినప్పటికీ కాలేజీ స్టూడెంట్ - షార్ట్ ఫిలిం నటి అయిన మేఘన పాత్రలో చాల ఈజ్ తో నటించి అందరినీ మెప్పించింది. రివ్యూయర్స్.. క్రిటిక్స్ తో పాటు మొదటి రోజుసినిమా చూసిన ఆడియన్స్ అందరూ ఆమెకు ఫుల్ మార్క్స్ ఇచ్చారు. నభా ఎనర్జీ.. తన తెలుగు డిక్షన్ కు మంచి మార్కులు పడ్డాయి. కొంతమందయితే అసలు ఈ సినిమా తన డెబ్యూ ఫిలిం అంటే నమ్మలేం అని కూడా కామెంట్ చేస్తున్నారు.

నటన పై ప్యాషన్ తో హీరోయిన్ గా మారిన ఈ కంప్యూటర్ ఇంజనీర్ కు టాలీవుడ్ లో మంచి ఫ్యూచర్ ఉందని అంటున్నారు. ఇక డైరెక్టర్ రవిబాబు తాజా చిత్రం 'అదుగో' లో కూడా నభా నటించింది. ఈ ప్రయోగాత్మక చిత్రం దసరా సీజన్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.