Begin typing your search above and press return to search.

ఇలియానా లేని లోటు తీరుస్తున్న నాటీ బేబి

By:  Tupaki Desk   |   12 Sep 2019 7:12 AM GMT
ఇలియానా లేని లోటు తీరుస్తున్న నాటీ బేబి
X
చాలా కాలంగా ఇల్లీ బేబి లేని లోటు టాలీవుడ్ లో అలానే ఉండిపోయింది. స‌న్న‌జాజి న‌డుముతో నిస్సిగ్గుగా ఎలాంటి బిడియం లేకుండా హొయ‌లు పోతూ కుర్రాళ్ల గుండెల్ని చిద్రం చేయ‌డంలో ఇలియానా స్కిల్ ని ఇంకే బేబీ అంది పుచ్చుకోలేక‌పోయింది. దీంతో థియేట‌ర్ల‌కు వ‌చ్చే కుర్రాళ్ల‌ను నీర‌సం ఆవ‌హించింది. స‌రిగ్గా అలాంటి టైమ్ లోనే రంగంలోకి దిగింది క‌న్న‌డ బొమ్మాళీ న‌భా న‌టేష్. వ‌స్తూనే కుర్ర గుండెల్ని చిద్రం చేసింది. హృదయాల్ని చీల్చి చెండాడింది. తెలుగు సినిమాకి గ్లామ‌ర్ కంటెంట్ త‌క్కువైపోయింది. పూరి మార్క్ మాస్ మ‌సాలాయిజం కూడా దూర‌మైపోవ‌డంతో చిన్న‌బోయింది ప‌రిశ్ర‌మ‌. అందుకే న‌భాని పూరి బాబు `ఇస్మార్ట్ శంక‌ర్` చిత్రానికి ఎంపిక చేయ‌గానే ఎక్క‌డా లేని ఉత్సాహం తిరిగొచ్చింది.

క‌న్న‌డ ప‌రిశ్ర‌మ నుంచి వ‌స్తూనే వ‌రుస ఫోటోషూట్ల‌తో పిచ్చెక్కించిన న‌భా వెంట‌నే పూరీని బుట్ట‌లో వేసేయ‌గ‌లిగింది. అంత‌గా వాడి వేడి లేని భామ‌ల జోలికి వెళ్ల‌ని పూరి ట‌పీమ‌ని ఈ పోరీని ప‌ట్టేశాడు. ఇక ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాలో న‌భా వొగ‌లు గురించి తెలిసిందే. ప‌క్కా ఊర మాస్ యాటిట్యూడ్ తో చంపేసింది అంతే. ఇల్లీ బేబీని తీర్చిదిద్దిన పూరి చేతిలో ప‌డింది కాబ‌ట్టి ఈ అమ్మ‌డికి కూడా అంత గౌర‌వం ద‌క్కింది. అందుకే ఇప్పుడు ఈ బ్యూటీ కెరీర్ టాలీవుడ్ లో కొత్త మ‌లుపు తిరుగుతోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కూ స‌రైన ఆఫ‌ర్లు లేవే అనుకుంటుండ‌గానే.. ఇప్పుడు ఏకంగా మెగా కాంపౌండ్ లోకే ఎంట‌రైపోతోంది.

మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌ర‌స‌న `డిస్కో రాజా` చిత్రంతో వేడెక్కించే పాత్ర‌లో న‌టిస్తున్న‌ ఈ బ్యూటీని వెతుక్కుంటూ సూట్ కేసులు ఇంటి త‌లుపు త‌డుతున్నాయ‌ట‌. ఇటీవ‌లే అక్కినేని అఖిల్ స‌ర‌స‌న చాన్స్ ద‌క్క‌నుందని ప్ర‌చార‌మైంది. ఆ ఆఫ‌ర్ సంగ‌తేమో కానీ.. తాజాగా సుప్రీం హీరో సాయిధ‌ర‌మ్ స‌ర‌స‌న న‌భా ఓ క్రేజీ చిత్రానికి సంత‌కం చేసింది. ఈ సినిమాకి టైటిల్ ఇంకా నిర్ణ‌యించాల్సి ఉంది. ఇదే చిత్రంతోనే సుబ్బు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. అక్టోబ‌ర్ లో సినిమా ప్రారంభం కానుంది. మెగా నిర్మాత బీవీఎస్.ఎన్ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు కాబ‌ట్టి పెద్ద రేంజు అనే అనుకోవాలి. ర‌వితేజ త‌ర్వాత మ‌ళ్లీ అంత ఎన‌ర్జిటిక్ హీరో స‌ర‌స‌న అవ‌కాశం కొట్టేసింది. ఇప్పుడు ఏకంగా మెగా కాంపౌండ్ లో అడుగు పెట్టింది కాబ‌ట్టి అక్క‌డ హీరోలంద‌రినీ చాప చుట్టేస్తుందేమో చూడాలి.