ట్రైలర్ టాక్: కొత్తకొత్తగా 'నా నువ్వే'

Wed May 16 2018 10:18:54 GMT+0530 (IST)

సాఫ్ట్ అండ్ సటిల్ కథనంతో.. రొమాన్స్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా తీర్చిదిద్దడం చాలా తక్కువగా మన తెలుగు సినిమాల్లో కనిపిస్తుంది. కాని కొంతమంది బాలీవుడ్ అండ్ సాంబార్ ల్యాండ్ దర్శకులు మాత్రం అలాంటి సినిమాలను భలే రూపొందిస్తున్నారు. కొన్ని సినిమాలు ఆడకపోయినా కూడా.. ఎందుకో వాటిలో ఉన్నంత రొమాన్స్ మన సినిమాల్లో కనిపించదేంటి అన్నట్లే ఉంటాయి. ఇప్పుడొస్తున్న ''నా నువ్వే'' కూడా అలాంటి ఇంటెన్స్ రొమాంటిక్ సినిమాయేనని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది.ఒక అందమైన రేడియో జాకీ.. ఓ కుర్రాడి వెంటపడుతుంటుంది. కాని వారు విడిపోవాల్సిన సమయం వస్తుంది. అయితే మళ్ళీ కలుస్తాం అంటూ టాటా చెప్పి ఆమె వెళిపోతుంది. ఆ తరువాత తన ప్రేమ గురించి మైకులో చెబుతూనే ఉంటుంది. ఈ సమయంలో ఆ అబ్బాయి ఆమెను వెతుక్కుంటూ రావడం.. ఆ తరువాత ఏం జరుగుతుంది అన్నదే 'నా నువ్వే' సినిమా కథ. నిజానికి తమ కెరియర్లో మొదటి సినిమానో రెండో సినిమానో చేస్తున్నట్లు.. తమన్నా అండ్ కళ్యాణ్ రామ్ ఇద్దరూ ఇరగదీశారు. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ కొత్త లుక్ అండ్ సటిల్ యాక్టింగ్ భలేగా ఉంది. అలాగే ఊర మాస్ అందాలను ఆరబోసీ ఆరబోసీ విసుగు తెప్పించిన తమన్నా.. ఈ సినిమాలో మాత్రం మరోసారి తనలోని యాక్టింగ్ స్కిల్ ఇంకా చచ్చిపోలేదని ప్రూవ్ చేసింది. భలే ముద్దుగా ఉందిలే.

180 వంటి విభిన్న సినిమాలను తీసిన యాడ్ ఫిలిం మేకర్ జయేంద్ర.. మరోసారి ఈ సినిమాతో ఆకట్టుకునేలా ఉన్నాడు. కమర్షియల్ రిజల్ట్ తెలియదు కాని.. ప్రేమికుల హృదయాలను మాత్రం కేవలం ట్రైలర్ తోనే బాగా గట్టిగా టచ్ చేశాడు. ఇలాంటి రసభరితమైన ప్రేమకథలకు మనోహరమైన విజువల్స్ కూడా కావాలి. వాటి విషయంలో పిసి శ్రీరాం మరోసారి ఇండియాలోనే తనకు తిరుగులేదు అన్నట్లు విజృంభించాడు. ప్రతీ ఫ్రేమ్ అదిరిపోయింది. అలాగే శరత్ అందించిన మ్యూజిక్ కూడా ఈ రొమాన్సుకు కొత్త డైమన్షన్ యాడ్ చేసింది. మొత్తంగా వావ్ అనిపించిన 'నా నువ్వే' ధియేటర్లలో కూడా చరిత్ర సృష్టిస్తుందని ఆశిద్దాం.

వీడియో కోసం క్లిక్ చేయండి