అన్ని వ్యూస్ ఎట్టా వచ్చాయబ్బా!?

Thu May 17 2018 23:17:55 GMT+0530 (IST)

ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లలో ట్రైలర్స్ ట్రెండ్ అవుతుండడం కామన్ అయిపోయింది. చాలా వరకు సినిమాలకు ఇది ఒక ప్రమోషన్స్ లా మారింది. ఎన్ని వ్యూవ్స్ వస్తే అంత లాభం. కానీ అప్పుడప్పుడు కొంత మంది తెలిసి చేస్తున్నారో లేక తెలియక చేస్తున్నారో గాని ప్రమోషన్స్ పెరగాలని వ్యూవ్స్ పెరిగేందుకు కొన్ని  ట్రిక్స్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు అదే తరహాలో నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా ట్రైలర్ కు కూడా జరిగిందా అనే అనుమానం కలుగుతోంది.24 గంటలు తిరగకముందే సినిమా ట్రైలర్ ను 7 మిలియన్ల మంది వీక్షించినట్లు నెంబర్ చూస్తే తెలుస్తోంది. ఆశ్చర్యం కలిగిస్తోన్న విషయం ఏమిటంటే లైకులు మాత్రం డిఫరెంట్ ఉన్నాయి. కేవలం 20 వేల లైకులు రావడం వ్యూవ్స్ నెంబర్ కి మ్యాచ్ అవ్వడం లేదు. పవన్ కళ్యాణ్ ఆజ్ఞాతవాసి - జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ రేంజ్ లో కళ్యాణ్ రామ్ సినిమాకు వ్యూవ్స్ రావడం అందరికి షాక్ ఇస్తోంది. వస్తే వచ్చాయి గాని లైకుల విషయంలో ఎదో తేడా కొడుతోందని.. ట్రిక్స్ ప్లే చేసి వ్యూవ్స్ కౌంట్ ను పెంచుకున్నారా అనే అనుమానం కలుగుతోందని.. నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

పైగా మళ్లీ మళ్లీ చూడటానికి ట్రైలర్ కూడా కొత్తగా ఏమి లేదు. దీంతో నెటీజన్స్ కామెంట్స్ కొత్త అనుమానాలకు తెరలేపుతున్నాయ్. గతంలో కొంత మంది ట్రిక్స్ ప్లే చేసి దొరికిపోయారు. మరి ఇది ఎంతవరకు నిజమో చిత్ర యూనిట్ తెలియాలి.  జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక సీనియర్ కెమెరామెన్ పిసి.శ్రీరామ్ సినిమాటోగ్రఫర్ గా వర్క్ చేస్తుండగా శరత్ సంగీతాన్ని అందిస్తున్నారు.