రంగుల జంట పోస్టర్ భలే ఉందమ్మా

Mon Apr 16 2018 19:39:08 GMT+0530 (IST)

కళ్యాణ్ రామ్ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకొస్తున్నాడు. రీసెంట్ గా ఎమ్మెల్యే అంటూ ప్రేక్షకులను పలకరించిన ఈ నందమూరి హీరో.. ఇప్పుడు మరో చిత్రాన్ని రిలీజ్ కి రెడీ చేసేశాడు. నా నువ్వే అంటూ తెరకెక్కిన ఈ చిత్రంలో.. కళ్యాణ్ రామ్ కు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా నటించింది.గతంలో విడుదల అయిన నా నువ్వే టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. విజువల్ గా ఎంతో డిఫరెంట్ గా ఉన్న సినిమాను అందించబోతున్నట్లు ముందుగానే హింట్ ఇచ్చిన నా నువ్వే మూవీకి.. ఇప్పుడు ప్రమోషన్ పనులు స్టార్ట్ చేశారు. ఈ సినిమాను మే నెల 25న విడుదల చేసేందుకు షెడ్యూల్ చేయగా.. ప్రమోషనల్ యాక్టివిటీస్ లో భాగంగా.. సాంగ్ టీజర్ ను విడుదల చేయబోతున్నట్లు నా నువ్వే మేకర్స్ అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 18వ తేదీ సాయంత్రం 5 గంటలకు 'చినికి చినికి' అంటూ సాగే పాటకు టీజర్ ఇవ్వనున్నట్లు.. కొత్త పోస్టర్ ద్వారా తెలియచేశారు. ఈ విషయాన్ని చెప్పేందుకు విడుదల చేసిన కొత్త పోస్టర్ సూపర్బ్ గా ఉంది.

లవ్ సింబల్ ను లైటింగ్ లో చూపిస్తూ.. మధ్యలో కళ్యాణ్ రామ్- తమన్నాల జంట మధ్య రొమాన్స్ ను చూపించిన విధానం బాగా ఆకట్టుకుంటోంది. మిల్కీ అందాలకు తోడు కళ్యాణ్ రామ్ కొత్త లుక్ కూడా విభిన్నంగా ఉంది. ప్యూర్ లవ్ స్టోరీని పండించేశారనే సంగతి పోస్టర్ ద్వారా తెలిసిపోతోంది. పీసీ శ్రీరాం ఛాయాగ్రహణం అందించగా.. యాడ్ ఫిలిం మేకర్ జయేంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా.. విజువల్ వండర్ గా నిలవడం ఖాయమనే అంచనాలున్నాయి.