నా మది తాప్సీని పిలిచింది గానమై

Sat Aug 12 2017 13:04:54 GMT+0530 (IST)

హింది సినిమాలతో బిజీగా మారిన తాప్సీ తెలుగు సినిమాలుకు కొంతకాలంగా దూరమైంది.  హింది సినిమాలు చేస్తూనే మళ్ళీ  తెలుగు హారర్ కామిడీ సినిమా ‘ఆనందో బ్రహ్మ’ ముఖ్య పాత్రలో నటిస్తుంది రింగుల జుత్తు తాప్సీ.  ‘ఆనందో బ్రహ్మ’ సినిమా పోస్టర్ దగ్గర నుండి సినిమా కథాంశం వరకు అన్నీ కొత్తగా ఉండేలా చూసుకుంటున్నారు ఆ చిత్ర యూనిట్. మనిషి దెయ్యంకు భయపడటం కామన్ దెయ్యం మనిషికి భయపడితే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా ద్వారా ఫన్నీగా చెప్పబోతున్నారు.  ఈ సినిమాకు సంబంధించిన టీజర్ మంచి స్పందన రావడంతో ఇప్పుడు అదే జోరులో ఈ సినిమాలో తాప్సీ పై చిత్రీకరించిన ఒక సాంగ్ విడుదల చేశారు.

సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఆరాధన సినిమాలో మహమ్మద్ రఫీ పాడిన ‘నా మది నిన్ను పిలిచింది గానమై.. వేణు గానమై’ అనే పాటను కొత్తగా వాడుకొనట్లు కనిపిస్తుంది. రేడియొలో ఆ పాటను వింటూ  ఖాళీగా ఉన్న ఇంటిలో పాడుకుంటూ డాన్స్ చేస్తూ ఆనందపడుతోంది తాప్సీ. ఇప్పటి మోడ్రన్ సంగీతంతో ఆ పాటకు జతచేసి హారర్ కామిడీ సంగీతం ట్రేడ్ మార్కు వచ్చే విదంగా మార్చి అహం బ్రహ్మాస్మి (నా మది నిన్ను పిలిచింది) వినిపించారు. ఈ సినిమాలో ఈ పాటను మాల్గుడి సుభా పాడింది. ఈ పాటలో ఉండే పరిమళాన్ని అలానే ఉంచుతూ కొత్తగా ప్రయత్నం చేశారు ‘ఆనందో బ్రహ్మ’ టీమ్.

మహి వి. రాఘవ డైరెక్ట్ చేసిన ‘ఆనందో బ్రహ్మ’ సినిమాను 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్ల  శశిదేవి రెడ్డి నిర్మిస్తున్నారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ ముగించుకొని విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాలో తాప్సీతో పాటుగా వెన్నెల కిషోర్ - శ్రీనివాసరెడ్డి - షకలక శంకర్ - తాగుబోతు రమేష్ - రాజీవ్ కనకాల ఇతర పాత్రలు పోషిస్తున్నారు. తాప్సీ ఈ సినిమాతో పాటుగా తన నటిస్తున్న హింది సినిమా ‘జూడ్వా2’ కూడా తొందరలో విడుదలకు సిద్దంగా ఉంది.