Begin typing your search above and press return to search.

కెసీఆర్ 2.0 విజ‌యోత్స‌వం-ఎన్‌.వి.ప్ర‌సాద్‌

By:  Tupaki Desk   |   11 Dec 2018 12:50 PM GMT
కెసీఆర్ 2.0 విజ‌యోత్స‌వం-ఎన్‌.వి.ప్ర‌సాద్‌
X
తెరాస విజ‌యోత్స‌వాన్ని అటు గులాబీ ద‌ళాలే కాదు .. ఇటు సినీప‌రిశ్ర‌మ సెల‌బ్రేట్ చేసుకుంటోంది. నేటి మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్ ప్ర‌సాద్ లాబ్స్‌ లో జ‌రిగిన 2.ఓ స‌క్సెస్ మీట్‌ లో తెలుగు రాష్ట్రాల పంపిణీదారుడు ఎన్‌.వి.ప్ర‌సాద్ మాట్లాడుతూ .. కేసీఆర్ 2.ఓ విజ‌యోత్స‌వంలా ఉందీ స‌న్నివేశం అని అన్నారు. టీఆర్ ఎస్ లానే 2.ఓ విజ‌యోత్స‌వం సాగుతోంద‌ని, సంక్రాంతి వ‌ర‌కూ ఈ సినిమా ఆడుతుంద‌ని వ్యాఖ్యానించారు. మొత్తానికి ఆయ‌న వ్యాఖ్య‌ల‌తో సినీప‌రిశ్ర‌మ‌లోనూ తేరాస విజ‌యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంద‌ని అర్థ‌మ‌వుతోంది. నేటి ఉదయం ర‌చ‌యిత కోన వెంక‌ట్ - ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ తేరాస విజ‌యంపై ఆనందం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇక ఆక్వామేన్ గురించి ఎన్‌.వి. ప్ర‌సాద్ మాట్లాడుతూ -``కాంజురింగ్ 1 - 2 చిత్రాల ద‌ర్శ‌కుడు రూపొందించిన ఆక్వామేన్ చిత్రం తెలుగులో రిలీజ్‌ కి వ‌స్తోంది. ఈనెల 13న తెలుగు రాష్ట్రాల్లోని అన్ని మ‌ల్టీప్లెక్సుల్లో ప్రీమియ‌ర్లు వేస్తున్నాం. అన్ని ఐమ్యాక్స్‌ ల‌లో రేప‌టి సాయంత్రం షో ప‌డుతోంది. అమెరికా కంటే వారం ముందే భార‌త‌దేశంలో రిలీజ‌వుతున్న ఈ చిత్రం ఇక్క‌డా సంచ‌ల‌న విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. ఈ చిత్రంలో క‌థానాయ‌కుడు స‌ముద్ర బాహుబ‌లిగా అల‌రిస్తాడు.. అన్నారు ఎన్ వి.ప్ర‌సాద్. 2.ఓ త‌ర్వాత ఆయ‌న నుంచి వ‌స్తున్న మ‌రో భారీ విజువ‌ల్ ఫీస్ట్ చిత్ర‌మిది. ఈనెల 14న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంద‌ని తెలిపారు. చైనాలో 3డి లో రిలీజై 100 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసింది. తెలుగులోనూ స‌ముద్ర బాహుబలి లాంటి సినిమా ఇది.. అన్నారు. ఇటీవ‌లే మా సంస్థ నుంచి రిలీజైన 2.ఓ ఘ‌న‌విజ‌యం సాధించి పిల్ల‌లు - పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రినీ ఆక‌ట్టుకుంది. సంక్రాంతి వ‌ర‌కూ ఈ సినిమా ఆడుతుంది... అని అన్నారు.

జేస‌న్ మ‌మోవా - అంబ‌ర్ హియ‌ర్డ్ క‌లిసి న‌టించిన చిత్రం `అక్వామేన్`. జేమ్స్ వాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన యాక్ష‌న్ ప్యాక్డ్ అడ్వంచ‌ర‌స్ చిత్ర‌మిది. జేస‌న్ మ‌మోవా టైటిల్ రోల్ లో క‌నిపిస్తారు. జేస‌న్ ఫ్రెండ్ మేర పాత్ర‌లో అంబ‌ర్ క‌నిపిస్తారు. ఇండియాలో ఇంగ్లిష్‌ - హిందీ - త‌మిళ్‌ - తెలుగులో విడుద‌ల కానుంది. వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ పిక్చ‌ర్స్ త్రీడీలోనూ - ఐమాక్స్ త్రీడీలోనూ విడుద‌ల చేయ‌నుంది.