Begin typing your search above and press return to search.

మళ్ళీ టీవీలోకి వస్తున్న ఎన్టీఆర్

By:  Tupaki Desk   |   19 Jun 2018 6:30 AM GMT
మళ్ళీ టీవీలోకి వస్తున్న ఎన్టీఆర్
X
బుల్లితెరపై కూడా స్టార్ హీరోలు సత్తా చాటగలరని యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిరూపించాడు. స్టార్ మా మొదటి బిగ్ బాస్ సీజన్ లో అందరిని మెప్పించి ఒక క్రేజ్ తీసుకువచ్చాడు. అయితే మళ్ళీ టీవీలోకి ఎన్టీఆర్ రానున్నాడా? అనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.

మీరు విన్నది నిజమే. తారక్ మళ్లీ టీవీల్లో ప్రత్యక్షం కానున్నాడు. అయితే ఈ సారి బిగ్ బాస్ లో కాదులేండి. పాపులర్ డ్యాన్స్ షో 'డీ 10' లో తారక్ కనిపించనున్నాడు. ఈ టీవీలో ఆ షో టెలిక్యాస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక నిన్న జరిగిన డీ గ్రాండ్ ఫైనలే పోటీల్లో తారక్ పాల్గొన్నాడు. భారీ సెటప్ తో తారక్ ఎంట్రీ ప్లాన్ చేశారు. వచ్చే నెల 4వ తేదీన డీ ఫైనల్ షో ప్రసారం కానుంది. మొన్నటి వరకు తారక్ అరవింద సమేత సినిమాతో బిజీగా ఉండడంతో నిన్న ఫైనల్ ప్లాన్ చేశారు. ఇక ప్రియమణి.. శేఖర్ మాస్టర్.. యానీ మాస్టర్ లు న్యాయనిర్ణేతలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఫైనల్ ట్రోపిని తారక్ చేతుల మీదుగా విన్నర్ కు అందించారు.

ప్రస్తుతం తారక్ కొంచెం బ్రేక్ లో ఉన్నాడు. ఇటీవల ఆయనకు కుమారుడు జన్మించినల్ సంగతి తెలిసిందే. ఇక అరవింద సమెత షూటింగ్ మరికొన్ని రోజుల్లో 70% పూర్తి కానుంది. మిగిలిన షూటింగ్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి దసరాకి సినిమాను రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నారు.