Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్.. వంశీని డైలమాలో పెట్టేశాడే

By:  Tupaki Desk   |   31 Aug 2016 1:30 PM GMT
ఎన్టీఆర్.. వంశీని డైలమాలో పెట్టేశాడే
X
‘శ్రీమంతుడు’ సినిమా తర్వాత కొరటాల శివ.. ఎన్టీఆర్ తో సినిమా చేయడం పక్కా అని అంతా అనుకుంటున్న టైంలో అతనేమో.. ‘‘ఇంకా ఏం అనుకోలేదు. చర్చలు నడుస్తున్నాయంతే’’ అంటూ అందరినీ డైలమాలోకి నెట్టేశాడు. కానీ ఆ తర్వాత అందరూ అనుకున్నట్లే ఎన్టీఆర్ తోనే కొరటాల సినిమా చేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ మాటల్ని కూడా ఇలాగే భావించాలో లేదో అర్థం కావడం లేదు.

‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్.. వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేస్తాడనే అంతా అనుకుంటున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా చాన్నాళ్ల కిందటే రిలీజ్ చేశారు. ఈ మధ్యే స్క్రిప్టు ఫైనలైజ్ అయ్యిందని.. దీనికి ‘దడ్కన్’ అనే పేరు అనుకుంటున్నారని కూడా వార్తలొచ్చాయి. ఐతే ‘జనతా గ్యారేజ్’ ప్రమోషన్లలో భాగంగా వంశీ సినిమా గురించి అడిగితే.. ఎన్టీఆర్ చిత్రమైన సమాధానం చెప్పాడు.

‘‘అది చర్చల దశలో ఉంది. ఇంకా ఏం అనుకోలేదు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత కొంత విరామం తీసుకుంటా. ఆ తర్వాతే కొత్త సినిమా గురించి ఆలోచిస్తా’’ అన్నాడు ఎన్టీఆర్. రేపో మాపో షూటింగ్ మొదలనుకుంటూ ఉంటే ఇంకా ‘చర్చల దశ’ ఏంటో అర్థం కావడం లేదు. పైగా ‘ఇంకా ఏం అనుకోలేదు’ అన్న మాట కూడా డైలమాలోకి నెట్టేదే. ఈ డైలమా జనాలకు మాత్రమే పరిమితమా.. వక్కంతంను కూడా తారక్ ఇలాంటి డైలమాలోనే పెట్టాడా?