Begin typing your search above and press return to search.

తాతయ్య కథలో తారక్ ఉంటాడా?

By:  Tupaki Desk   |   18 Oct 2017 2:34 PM GMT
తాతయ్య కథలో తారక్ ఉంటాడా?
X
టాలీవుడ్ లో ప్రస్తుతం సీనియర్ ఎన్టీఆర్ అనే పేరు బాగా వినిపిస్తోంది. వార్తలలో కూడా బయోపిక్ పర్వం పై అనేక కథనాలు అనుమానాలు వెలువడుతున్నాయి. ఇంతవరకు దేశంలో ఎన్నో బయోపిక్స్ తెరపైకి వచ్చాయి. వివాదాలు ఉంటే రెండు మూడు రోజుల్లో మ్యాటర్ సెట్ అయ్యేది. కానీ తొలిసారి తెలుగులో ఒక బిగ్ స్టార్ సినిమా బయోపిక్ గా రావడంతో ఇతర ఇండస్ట్రీ మీడియా వాళ్లు కూడా టాలీవుడ్ పై ఓ కన్నేసి ఉంచారు.

అయితే రోజుకో వార్త వస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ పై మరొక న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం గురించి పక్కనపెడితే.. తేజ తెరకెక్కించబోయే బయోపిక్ లో నందమూరి ఫ్యామిలీలో ఉన్న కొంతమంది బయోపిక్ లో నటిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా యువ హీరోలు తాత బయోపిక్ లో చిన్న అవకాశం వచ్చినా చాలు అంటున్నారట. అయితే తేజ మాత్రం ఇంకా ఎవరి పాత్రను డిసైడ్ చెయ్యలేదని టాక్. ముందుగా అనుకున్నట్లు ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ ఫిక్స్. అలాగే ఆయన కుమారుడు మోక్షజ్ఞని కూడా తాత యుక్త వయసులో ఉన్న క్యారెక్టర్ ని చేయించాలని బాలయ్య డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ఇక నందమూరి వారసుల్లో ప్రస్తుతం టాప్ లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాలో ఉంటాడా లేదా అనేది ప్రస్తుతం అందరిలో మెదులుతున్న ప్రశ్న ఎందుకంటే బాలయ్య - ఎన్టీఆర్ కలయిక జరిగి ఏళ్లు గడుస్తోంది. ఎన్టీఆర్ బాలయ్య సినిమాల గురించి మాట్లాడినా.. బాలకృష్ణ మాత్రం ఎన్టీఆర్ గురించి ఎక్కడా ప్రస్తావించినా దాఖలాలు లేవు. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో సినిమాలో నటిస్తే సినిమాకి హైప్ రావడం ఖాయం. తేజ కూడా ఎన్టీఆర్ ని బయోపిక్ లో దించేందుకు చాలా ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. మరి బాలయ్య గారి అభిప్రాయం ఎలా ఉంటుందో.