Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కి తేడా కొట్టదట

By:  Tupaki Desk   |   22 Nov 2017 8:14 AM GMT
త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కి తేడా కొట్టదట
X
టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా నడుస్తోన్న చర్చ ఏదైనా ఉందా అంటే అది ఒక్క రాజమౌళి మల్టి స్టారర్ గురించే అని చెప్పాలి. జక్కన్న అలా తారక్ - చరణ్ తో ఫొటో దిగి పోస్ట్ చేశాడో లేదో రూమర్స్ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాయి. అధికారికంగా ఇంకా ఏ న్యూస్ లేకపోయినా మల్టీస్టారర్ సినిమా తీయడానికి దర్శకుడు రెడీ అయ్యాడట. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్సమెంట్ రాబోతోందని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చర్చించుకుంటున్నారు.

అంతా బాగానే ఉంది కానీ తారక్ నెక్స్ట్ త్రివిక్రమ్ తో ఒకే చేసినాక సినిమా షూటింగ్ లో రెగ్యులర్ గా పాల్గొంటాడ లేక పూర్తిగా జక్కన్న ప్రాజెక్ట్ పైనే ద్రుష్టి పెడతాడా అని కొందరు చర్చించుకుంటున్నారు. అయితే అందులో నిజం అంతగా లేదు అని తెలుస్తోంది. ఎందుకంటే రాజమౌళి కథ చర్చలు జరిపి పూర్తిగా సెట్స్ పైకి తీసుకువచ్చే సరికి చాలా సమయమే పడుతుంది. అంటే 2018 చివరలో సినిమా ఫైనల్ గా స్టార్ట్ అవ్వడం ఖాయం.

అయితే అప్పటిలోపు జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ని పూర్తి చేయగలడు. ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తారక్ సినిమాను ఆయన ఫిబ్రవరిలో స్టార్ట్ చేయనున్నాడట. ఫైనల్ గా వచ్చే ఏడాది లోనే అంటే విజయదశమి కానుకగా సినిమాను రిలీజ్ చేయాలనీ తారక్ ఒక ప్లాన్ వేసుకున్నాడని తెలుస్తోంది. ఇక ఆ తర్వాత చెర్రీతో కలిసి రాజమౌళి మల్టి స్టారర్ ని స్టార్ట్ చేస్తాడని టాక్.