Begin typing your search above and press return to search.

ఇంకా 20 రోజులే ఉంది ఎన్టీఆర్!!

By:  Tupaki Desk   |   18 Aug 2017 7:30 PM GMT
ఇంకా 20 రోజులే ఉంది ఎన్టీఆర్!!
X
దసరా రేసును ఎట్టి పరిస్థితుల్లో మిస్సయ్యేది లేదు అంటూ ప్రకటించాడు కళ్యాణ్‌ రామ్. తన తమ్ముడితో తీస్తున్న ''జై లవ కుశ'' సినిమాను పోస్టుపోన్ చేస్తున్నట్లు వస్తున్న రూమర్లను అస్సలు నమ్మొద్దంటూ చెప్పేశాడు. అదంతా బాగానే ఉంది కాని.. ఇప్పుడు ఎన్టీఆర్ ఇంకా సినిమా షూటింగులో బిజీగా ఉండటంతో.. అసలు మనోడి దగ్గర ఉన్న టైమ్ ఈ సినిమాను పూర్తి చేయడానికి సరిపోతుందా అనే సందేహాలు వస్తున్నాయి.

ఇవాళ ఆగస్టు 18. అంటే ''జై లవ కుశ'' సినిమా రిలీజవ్వడానికి రమారమి ఇంకా 30 రోజులు ఉంది. అందులో 10 రోజులపాటు జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ కు సమయం కేటాయిస్తాడు కాబట్టి.. మనోడి దగ్గర ఈ సినిమా కోసం కేవలం 20 రోజులే ఉన్నట్లు. అందులోనూ ఓ వారం రోజులు ప్రమోషన్లకు కేటాయించాలి. అంటే కేవలం 13 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ టైములోనే టాకీపార్టు అలాగే పాటల షూటింగ్ కూడా కంప్లీట్ చేయాలి. ఈ మధ్య కాలంలో చాలామంది పెద్ద హీరోల సినిమాలు ఇలా ఆఖరి నిమిషంలో కత్తిమీద సాము తరహాలో పూర్తి చేస్తున్నారులే కాని.. మరి ఎన్టీఆర్ ఈ సినిమాలో ట్రిపుల్ రోల్ చేస్తున్నాడు కాబట్టి.. అసలు ఈ సమయం సరిపోతుందా అనే సందేహం రావడం సహజమే. కాని ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు మాత్రం అస్సలు కంగారుపడకండి అంటున్నారు.

కెఎస్ రవీంద్ర డైరక్షన్లో రూపొందుతున్న జై లవ కుశ సినిమాలో ఎన్టీఆర్ సరసన రాశి ఖన్నా మరియు నివేథా థామస్ లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు. సెప్టెంబర్ 21న సినిమా రిలీజవ్వనుంది.