Begin typing your search above and press return to search.

చరణ్‌.. ఎన్టీఆర్‌.. పోటాపోటీ!!

By:  Tupaki Desk   |   14 Feb 2016 4:45 AM GMT
చరణ్‌.. ఎన్టీఆర్‌.. పోటాపోటీ!!
X
మెగా హీరో రామ్‌ చరణ్‌.. యంగ్‌ టైగర్‌ జూ.ఎన్టీఆర్‌.. ఇద్దరూ మాంచి స్నేహితులే. రెగ్యులర్‌ గా కలుస్తూనే ఉంటారు. అయితే ఈసారి కలసి ఏకంగా సినిమానే మొదలెడుతున్నారు. సారీ.. కలసి సినిమాలను మొదలెడుతున్నారు.

ఈ నెల ఫిబ్రవరి 22న.. ఇటు చెర్రీ అటు తారక్‌ ఇద్దరూ ఒకేసారి తమ కొత్త సినిమాలను మొదలు పెడుతున్నారు. తని ఒరువన్‌ రీమేక్‌ ను సురేందర్‌ రెడ్డి డైరక్షన్‌ లో చరణ్‌ మొదలుపెడుతుంటే.. ఈ సినిమాకు ''రక్షక్‌'' అనే వర్కింగ్‌ టైటిల్‌ ను సెట్‌ చేశారు. ఇక కొరటాల శివ డైరక్షన్‌ లో ''జనతా గ్యారేజ్‌'' షూటింగ్‌ ను ఎన్టీఆర్‌ కూడా 22నే మొదలెడుతున్నాడట. సర్లే స్నేహితులు ఇద్దరూ ఒకే రోజు కొత్త సినిమాలను స్టార్ట్‌ చేస్తున్నారు అనుకుంటే.. ఇక్కడ ఇంకో ట్విస్ట్‌ ఏంటంటే.. ఫిబ్రవరి 22 నుండి షూటింగ్‌ స్టార్ట్‌ చేసి.. ఆగస్టు 12న రిలీజ్‌ ప్లాన్‌ చేశారు.

సర్లేండి.. ఇద్దరు స్టార్‌ హీరోలు ఒకే రోజున వస్తున్నారంటే.. ఖచ్చితంగా అది సూపరే. పోటీ ఏమో కాని.. మొన్న సంక్రాంతి టైములో పోటీ వచ్చినట్లు మాంచి రసవత్తరంగా ఉంటుంది సీన్‌ అంతా!!