Begin typing your search above and press return to search.

నందమూరి బ్రదర్స్ కు టైటిళ్ళ కొరతా??

By:  Tupaki Desk   |   22 March 2017 7:34 AM GMT
నందమూరి బ్రదర్స్ కు టైటిళ్ళ కొరతా??
X
తెలుగు సినిమాల వరకు సినిమా ఆడాలంటే మాత్రం టైటిల్ ముఖ్యం. కొన్ని సినిమాల్లో కంటెంట్ ఎంత బాగున్నప్పటికీ.. టైటిల్ లో దమ్ము లేకపోవడంతో అవి రీచ్ అవ్వవు. అలాగే కొన్నింటిలో టైటిల్ పరంగా కత్తిలా ఉంటాయ్ కాని.. కంటెంట్ తో తేలిపోతాయ్. అనవసరంగా టైటిల్ కారణంగా ఓవర్ హైప్ అయిపోతుంటుంది. అందుకే చాలా బ్యాలెన్సడ్ గా ఈ టైటిల్స్ ను ఎంచుకోవాలి.

మొన్న ఎన్టీఆర్ 'జై లవకుశ' అన్నాడు. ఇప్పుడు కళ్యాణ్‌ రామ్ 'ఎమ్మెల్యే.. మంచి లక్షణాలున్న అబ్బాయి' అంటున్నాడు. పాత ఎన్టీఆర్ టైటిల్ ను ఈ బుడ్డ ఎన్టీఆర్ తీసుకుంటే.. జూనియర్ తో హరీశ్‌ శంకర్ తీద్దామనుకున్న సినిమాకు అనుకున్న టైటిల్ ను కళ్యాణ్‌ రామ్ తీసుకున్నాడు. చూస్తుంటే టైటిళ్ళ కొరత కారణంగా ఇప్పుడు నందమూరి బ్రదర్స్ ఇలా పాత టైటిల్స్ చుట్టూ తిరుగుతున్నట్లు అనిపించట్లేదూ? లేకపోతే ఒక ప్రక్కన ఇతర హీరోలందరూ కొత్తకొత్తగా ఉండే టైటిల్స్ కోసం వెతుకుతుంటే.. వీళ్లేంటి ఇలా పాత పేర్లను వాడుకుంటున్నారు?

నిజానికి టైటిల్స్ విషయంలో చాలా తక్కువ డైరక్టర్లు మాత్రమే ఏదన్నా కొత్తగా ఆలోచిస్తున్నారు. పూరి జగన్ నెగెటివ్ గా.. త్రివిక్రమ్ అయితే ఫ్యామిలీ టచ్ తో.. టైటిళ్లను ఎంచుకుంటున్నారు. ఇక మిగిలిన డైరక్టర్లు హీరో క్రేజ్ అండ్ ఇమేజ్ ను బట్టే పేర్లను పెడుతున్నారు కాని.. ఒక ప్రత్యేక స్టయిల్ ను చూపించట్లేదు. మే బి అందుకే నందమూరి బ్రదర్స్ కోసం కూడా వారి దర్శకులు ప్రయోగాలు చేయకుండా క్రేజ్ ను బట్టి ఈ పేర్లను సెలక్ట్ చేసుకున్నారేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/