ఎన్టీఆర్ కు జై లవ కుశ రిజల్టు డౌటా?

Mon Sep 11 2017 23:00:01 GMT+0530 (IST)

జై లవ కుశ. ఎన్టీఆర్ హీరోగా.. కళ్యాణ్ రామ్ ప్రొడక్షన్లు.. దర్శకుడు కె.ఎస్.రవీంద్ర తీసిన సినిమా. ఈ నెల 21న రీలజవ్వనుంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలా తన సత్తా చాటుతుందోనని అభిమానలు కాస్త టెన్షన్ పడుతుంటే.. ఇప్పుడు ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ లు కలసి.. వారిని ఇంకా సందిగ్దంలోకి నెట్టేస్తున్నారు. ముఖ్యంగా నిన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో వీరు చేసిన కామెంట్లు వింటుంటే.. అందరికీ కొత్త సందేహాలే వస్తున్నాయి.ముఖ్యంగా ఎన్టీఆర్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. 'సినిమా హిట్టవ్వుతుందా  ఫ్లాపవుతుందా అనేది మన చేతుల్లో లేదు. అది దేవుడు చేతిలో ఉంది. ఈ సినిమాలో అన్నదమ్ముల అనుబంధం చూపించాం. తరువాత ఏం జరుగుతుందో నాకు తెలియదు' అంటూ ఒక మాటన్నాడు. అలాగే సినిమాను ఇద్దరు ఆప్తులకు చెప్పానని చెప్పిన ఎన్టీఆర్.. వారి పేర్లు మాత్రం రేపు సినిమా హిట్టయితేనే చెబుతా అన్నాడు. అసలు తనకు కాన్ఫిడెన్స్ లేకపోతేనే కదా అలా సందేహిస్తూ సంశయిస్తాడు అంటున్నారు సినిమా లవ్వర్స్.

ఇక కళ్యాణ్ రామ్ మాట్లాడతూ.. ''ఈ సినిమాను డబ్బు కోసం తీయలేదు. మనీ ఏముంది.. ఒక పీస్ ఆఫ్ పేపర్.. కేవలం మా అన్నదమ్ముల కాంబినేషన్.. దానిపై ఫ్యాన్స్ కు ఉన్న అంచనాలకు మించి ఉండడానికి ఒక ప్రయత్నం చేశాం. నేను హిట్టూ ఫ్లాపూ పట్టించుకోను'' అని చెప్పేశాడు. ఇదంతా చూస్తుంటే.. 'అసలు సినిమా ఖచ్చితంగా మీకు బాగా నచ్చుతుంది.. అవుట్పుట్ అదిరిపోయింది' అని చెప్పుకుండా ఇలా 'దేవుడు' 'మన చేతుల్లో లేదు' అంటుంటే.. సినిమా రిజల్ట్ మీద వీళ్లకు అనుమానాలు ఉన్నాయా అనే అనుమానం ఎవరికైనా వస్తుంది మరి.