Begin typing your search above and press return to search.

మోసగాళ్లకు మోసగాడు చూసి ఎన్టీవోడు...

By:  Tupaki Desk   |   27 Aug 2016 9:40 AM GMT
మోసగాళ్లకు మోసగాడు చూసి ఎన్టీవోడు...
X
మోసగాళ్లకు మోసగాడు.. తెలుగు సినీ చరిత్రలోనే చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా. హాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన కౌబాయ్ సినిమాల్ని ఇండియన్ స్క్రీన్ కు పరిచయం చేసిన ఘనత ‘మోసగాళ్లకు మోసగాడు’దే. ఆ రోజుల్లోనే భారీ ఖర్చుతో.. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి.. అప్పటిదాకా తెలుగు ప్రేక్షకులెవ్వరూ చూడని లొకేషన్లలో షూటింగ్ చేశారు. విడుదల తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా ఈ సినిమా గురించి చర్చ జరిగింది. అన్ని ఇండస్ట్రీల్లోనూ కదలిక తెచ్చిన ఈ సినిమా మరెన్నో కౌబాయ్ సినిమాలకు స్ఫూర్తిగా నిలిచింది. కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను డేరింగ్ హీరో కృష్ణే స్వయంగా నిర్మించాడు.

‘మోసగాళ్లకు మోసగాడు’ విడుదలై ఇవాళ్టికి సరిగ్గా 45 ఏళ్లు పూర్తవుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో అప్పట్లో ఈ సినిమా చూసి మహా నటుడు ఎన్టీఆర్.. ఏఎన్నార్ ఏమని స్పందించారో వెల్లడిస్తూ నాడు వాళ్లు కృష్ణను ఉద్దేశించిన రాసిన లేఖల్ని రిలీజ్ చేశారు పీఆర్వో బీఏ రాజు. విశిష్టమైన సాంకేతిక విలువలతో సినిమా తీయాలన్న పట్టుదల ప్రతి షాట్లో.. ప్రతి ఫ్రేములోనూ కనిపించిందని.. తెలుగు భాషలో చూస్తున్న ఇంగ్గిష్ సినిమా లాగా ‘మోసగాళ్లకు మోసగాడు’ అనిపించిందని.. కృష్ణ మున్ముందు ఇలాంటి కళాఖండాలు మరిన్ని అందించాలని అభిషలించారు ఎన్టీఆర్. ఎవ్వరూ వెళ్లనంత దూరం వెళ్లి ఎంతో శ్రమతో ఈ సినిమా తీసిన కృష్ణను అందరూ అభినందించాలని ఏఎన్నార్ అన్నారు.