Begin typing your search above and press return to search.

తారక్ ఓటు స్వామికే... శివకు కాదు!

By:  Tupaki Desk   |   21 May 2019 5:43 AM GMT
తారక్ ఓటు స్వామికే... శివకు కాదు!
X
నిన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. సహజంగా స్టార్ హీరోల జన్మదినం అంటే చాలు వారు నటించబోయే కొత్త సినిమాల వివరాలు బైటకు వస్తుంటాయి. కొందరు ప్రొడ్యూసర్లు బర్త్ డే పోస్టర్ లు కూడా వేస్తుంటారు. నిన్న అలాగే హారిక హాసినీ సంస్థ ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. అందులో ఉండే ఎన్టీఆర్ ఫోటో 'అరవింద సమేత' లుక్ కావడం.. పోస్టర్ లో త్రివిక్రమ్ పేరు కూడా ఉండడంతో ఇది జస్ట్ క్యాజువల్ విష్ అనుకున్నారు. కానీ దీని వెనక ఓ కారణం ఉందని సాయంత్రానికి బయటకు వచ్చింది.

ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా నిన్న రాత్రి పలువురు అభిమానులు ఎన్టీఆర్ నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా అభిమానులతో ముచ్చటిస్తూ RRR తర్వాత కుదిరితే త్రివిక్రమ్ తో మరో సినిమా చేస్తానని వెల్లడించారట. ఎన్టీఆర్ ప్రస్తుతం RRR తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయ్యేవరకూ మరో సినిమా గురించి ఆలోచించడం లేదని తారక్ ఇదివరకే చెప్పారు. కానీ RRR తర్వాత కొరటాల శివతో ఒక సినిమా చేసేందుకు తారక్ రెడీ అవుతున్నాడని మాత్రం గుసగుసలు విన్పిస్తూనే ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ మాత్రం స్వామికే ఓటేసినట్టున్నాడు(ఎన్టీఆర్..త్రివిక్రమ్ ఒకరిని ఒకరు స్వామి అని పిలుచుకుంటారు).

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అరవింద సమేత' యావరేజ్ గా మాత్రమే నిలిచింది. అయితే త్రివిక్రమ్ డైరెక్షన్ స్టైల్.. టేకింగ్ నచ్చడంతో తారక్ మరోసారి పనిచేయాలని అనుకుంటున్నారట. అయితే ఈ సినిమా పట్టాలెక్కేందుకు దాదాపుగా ఏడాది సమయం ఉంది. మరి ఆ లోపు భారీ మార్పుచేర్పులు జరగకుండా ఉంటే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడం సాధ్యమే.