Begin typing your search above and press return to search.

అది ఎన్టీఆర్ కాదు.. జస్ట్ ఫేక్ ఫోటో

By:  Tupaki Desk   |   23 March 2018 6:01 AM GMT
అది ఎన్టీఆర్ కాదు.. జస్ట్ ఫేక్ ఫోటో
X
సినిమాలకు సోషల్ మీడియాకు చాలా అక్రమ సంబంధమే ఉంది. సినిమా వాళ్లకంటే ముందే కొందరు ఇల్లీగల్ గా సినిమాకు సంబందించిన విషయాలను ఉహించుకొని ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టేస్తున్నారు. ఆది ఓ విధంగా క్రియేటివిటి పరంగా కిక్ ఇచ్చినా సినిమా వాళ్లకు నష్టాన్ని కలిగిస్తుంది. ఒక్కోసారి ఈ ఫెక్ న్యూస్ లు బాగానే అనిపిస్తాయి. ఫ్యాన్స్ ఆనందంతో చేసుకున్నారని హీరోలు కూడా పట్టించుకోరు.

అసలు మ్యాటర్ లోకి వస్తే..ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కు సంబందించిన ఒక ఫోటో వైరల్ అయిన సంగతి తెలిసిందే. జిమ్ లో వర్కౌట్ చేస్తూన్నట్లు ఉన్న ఆ ఫొటోలో తారక్ బాడీని చూసి అంతా షాక్ అయ్యారు. గత కొంత కాలంగా తారక్ ప్రముఖ జిమ్ ట్రైనర్ ఎల్.స్టీవెన్స్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నాడు. గతంలో ఓ వీడియో కూడా వచ్చింది. అయితే ఆ ఫొటోని చూసి స్టీవెన్ షాక్ అయ్యాడు.

నాకు తెలియకుండా తారక్ ఇంత బాడీ ఎప్పుడు పెంచేసాడు అని ఒక్కసారిగా మనుసులో అనుకొని అదంతా అబద్దం అని తేల్చి చెప్పాడు. సోషల్ మీడియాలో ఆ ఫ్యాన్ మేడ్ ఫొటోని పోస్ట్ చేసి ఇది నిజమైన ఫొటో కాదు. ఎవ్వరు నమ్మవద్దని చెబుతూ.. ఎవరు క్రియేట్ చేసారో గాని హ్యాట్సాఫ్ అంటూ స్టీవెన్ ట్వీట్ చేశాడు. అసలు అది ఎన్టీఆర్ ఫోటోనే కాదంటున్నాడు. దీంతో అభిమానులకు ఆ విషయంపై క్లారిటీ వచ్చింది.