మా బ్లెస్సింగ్స్ తోనే వీరులయ్యారు!

Thu Mar 14 2019 17:20:20 GMT+0530 (IST)

ఎంత వీరులైనా కాంత దాసులే! అనాలేమో!! భర్తలు ఎదగాలంటే భార్యామణుల అండదండలు లేకపోతే కష్టం. కష్టం.. నష్టం.. సుఖం.. దుఃఖం పంచుకునేది ఆలితోనే కాబట్టి ఎంత పెద్ద సూపర్ స్టార్లు అయినా కాస్త ఒదిగి ఉండాల్సిందే అక్కడ!! ప్చ్!!ఇకపోతే ఇదిగో ఇక్కడ ఈ సీను చూస్తుంటే ఆ ఇద్దరు వీరుల్ని ప్రెస్ మీట్ కి పంపించే ముందే ఈ ఇద్దరు వీరనారీమణుల మధ్య అసలు సంభాషణ ఏం జరిగి ఉంటుందో? అంటూ మెగా- నందమూరి ఫ్యాన్స్ ఒకటే ఊహగానాలు సాగిస్తున్నారు. ఒకరేమో కొమురం భీమ్(ఎన్టీఆర్).. ఇంకొకరేమో అల్లూరి సీతారామరాజు(చరణ్). ఆ ఇద్దరి వీరత్వాన్ని జక్కన్న ఆర్.ఆర్.ఆర్ లో చూపించబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించి మీడియాకి డీటెయిలింగ్ ఇచ్చే ముందే ఇరువురి ఫ్యామిలీల మధ్య భేటీ సాగిందని అర్థమవుతోంది.

ఇదిగో కొమురం భీమ్ (ఎన్టీఆర్ ) వైఫ్ లక్ష్మీ ప్రణతి.. అల్లూరి సీతారామరాజు (చరణ్) వైఫ్ ఉపాసన కొణిదెల ఇలా మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ లో ఏం ముచ్చటించుకున్నారో కానీ జక్కన్న ఆ ఇద్దరినీ 2020 వరకూ విడిచిపెట్టేట్టు లేడన్న సంభాషణ జరిగి ఉండాలి. అవును నిజమే.. ఆ విషయాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్ లో టచ్ చేశారు. 2020లో రిలీజ్ చేసేస్తున్నాడు కాబట్టి మమ్మల్ని జక్కన్న వదిలేస్తున్నాడులే! అంటూ ఛమత్కరించారు. ఒక బృహత్తరమైన ప్రాజెక్టును చేపట్టి యుద్ధరంగంలోకి దిగారు చరణ్ ఎన్టీఆర్. అది కూడా సతీమణుల అండదండలతోనే ఇది సాధ్యమైంది. చరణ్ - తారక్ స్నేహంపై ఆసక్తికర చర్చ సాగుతున్న వేళ ఆ ఇరువురి కుటుంబాల్లో స్నేహానుబంధం ఇలా సామాజిక మాధ్యమాల సాక్షిగా రివీలవుతోందిలా.