Begin typing your search above and press return to search.

జక్కన్న జట్టు కోసం ఎన్టీఆర్ ఆరాటం

By:  Tupaki Desk   |   28 May 2017 10:26 AM GMT
జక్కన్న జట్టు కోసం ఎన్టీఆర్ ఆరాటం
X
బాహుబలి ప్రాజెక్ట్ మొదలుపెట్టిన తర్వాత రాజమౌళి పూర్తిగా అందులో మునిగిపోయాడు. ఈ సినిమా రెండు పార్టులు పూర్తయ్యేసరికి ఐదేళ్లు పట్టింది. ముఖ్యంగా బాహుబలి-2 ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తుండటంతో రాజమౌళి పేరు మార్మోగిపోతోంది. రాజమౌళి తర్వాత సినిమా ఎవరితో చేస్తాడా అని తెలుగు ఇండస్ట్రీతో పాటు బాాలీవుడ్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కానీ తన నెక్ట్స్ ఏంటన్నది జక్కన్న ఇంతవరకు కన్పర్మ్ చేయలేదు. రాజమౌళితో పనిచేయాలని ఇప్పుడు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నాడు.

జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళిలది సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరూ ఇండస్ట్రీలో దాదాపు ఒకేసారి కెరీర్ ను మొదలెట్టారు. రాజమౌళి ఫస్ట్ డైరెక్ట్ చేసిన సినిమా ఎన్టీఆర్ తో చేసిన స్టూడెంట్ నెంబర్. 1. ఆ సినిమా తర్వాత ఇద్దరి కెరీర్ బాగా పుంజుకుంది. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి చేసిన సింహాద్రి రికార్డులన్నింటినీ బద్దలుకొట్టింది. చివరిగా వీళ్లిద్దరూ జట్టు కట్టిన సినిమా యమదొంగ. ఈ సినిమా కూడా మంచి హిట్ కొట్టింది. మరోసారి ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ చేయాలని కోరుకుంటున్నాడు. అందుకే తనకోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేయాలని రాజమౌళిని అడిగాడని తెలిసింది. కానీ రాజమౌళి దీనిపై ఇంకా పెదవి విప్పలేదు.

ప్రస్తుతం ఎన్టీఆర్ బాబీ డైరెక్షన్ లో జై లవకుశ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. దీని తర్వాత కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల సినిమాలు చేయాల్సి ఉంటుంది. మరి రాజమౌళి సబ్జెక్ట్ ఎప్పుడు రెడీ చేసి ఎన్టీఆర్ ను షూటింగ్ కు పిలుస్తాడో? వెయిట్ అండ్ సీ!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/