Begin typing your search above and press return to search.

ఆ వినాయకచవితికి 60 ఏళ్ళు

By:  Tupaki Desk   |   24 Aug 2017 6:25 AM GMT
ఆ వినాయకచవితికి 60 ఏళ్ళు
X
ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన టాలీవుడ్ లో ఎన్నో వేల సినిమాలు తెరకెక్కాయి. ఆ తారం రామారావు నుంచి ఈ తరం ప్రభాస్ వరకు ఎన్నో ప్రసిద్ధ సినిమాలు ప్రపంచానికి తెలిసేలా చేశారు మన కళాకారులు. ముఖ్యంగా పౌరాణిక కథలతో మన తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక చిత్రాలను తెరకెక్కించారు. వాటిలో పాతాళ భైరవి - మాయాబజార్ లాంటి అద్భుతమైన సినిమాలు ఇప్పటికీ గుర్తుండిపోయే అనేక సినిమాలు మన మదిలో మెదులుతాయి. వాటిలో "వినాయకచవితి" సినిమా కూడా ఒకటి. ఎటువంటి గ్రాఫిక్స్ లేని సమయాల్లోనే మనవాళ్ళు కెమెరా తో మ్యాజిక్ చేసి ప్రేక్షకులకు అప్పట్లోనే విజువల్స్ ని అందించారు. 1952 ఆగస్టు22న వచ్చిన ఈ సినిమా వచ్చింది. అయితే ఈ వినాయకచవితికి సినిమా వచ్చి 60 ఏళ్ళవుతుంది.

నందమూరి తారకరామారావు కృష్ణుని పాత్రలో నటించిన ఈ సినిమాను ప్రముఖ రచయిత సముద్రాల రాఘవాచార్య తొలిసారి దర్శకత్వం వహించి తెరకెక్కించారు. కథలో వినాయకచవితి పర్వదినం మరియు ఆ పండుగ ప్రాశస్త్యం అలాగే వినాయకచవితి రోజున చంద్రుని శాపం ఎలా జరిగింది దానితో పాటు ఆ రోజున చంద్రుని చూసి నీలాపనిందల పాలయిన శ్రీకృష్ణుడు ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు అనే పాయింట్స్ ని తీసుకొని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల్లో కెమెరా యాంగిల్స్ తోనే అద్భుతంగా చూపించి ఔరా అనిపించారు. ఈ సినిమా అప్పట్లో వినాయక చవితి పండుగకు ఎనిమిది రోజుల ముందు రిలీజ్ అయ్యి మంచి ఘనవిజయాన్ని అందుకుంది. ఇక తమిళ్ లో కూడా ఈ సినిమాను తెలుగులో నటించిన వారితోనే తెరకెక్కించి అక్కడ కూడా మంచి హిట్ అందుకున్నారు.

అశ్వరాజ్ ప్రొడక్షన్స్ పతాకంపై కె.గోపాలరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఘంటసాల సంగీతం అందుంచిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ కృష్ణునిగా నటించగా ఆయనకు జోడిగా కృష్ణకుమారి రుక్మిణిగా నటించారు. ఇక సత్యభామ పాత్రలో జమున జీవించేశారు. అలాగే సాత్రాజిత్తుగా - గుమ్మడి. జాంబవతిగా - సూర్యకళ నటించారు. వారితో పాటు రాజనాల - ఆర్.నాగేశ్వరరావు వంటి వారు వివిధ పాత్రలో అలరించారు. ఏదేమైనా ఈ సినిమా ఇప్పటికి ప్రేక్షకులకు భక్తిభావాన్ని తట్టి లేపుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.