Begin typing your search above and press return to search.

హ్యాట్రిక్ కోసం ఎన్టీఆర్ లో మళ్లీ ఛేంజ్

By:  Tupaki Desk   |   14 Feb 2016 9:30 AM GMT
హ్యాట్రిక్ కోసం ఎన్టీఆర్ లో మళ్లీ ఛేంజ్
X
లుక్ విషయంలో ఎన్టీఆర్ పై గతంలో విమర్శలుండేవి. పెద్దగా మార్పు చూపించడని అనేవారు. నిజానికి సినిమా కోసం కంప్లీట్ గా మార్పు చూపించచ్చని.. ఓసారి ప్రూవ్ చేశాడు. యమదొంగలో యముడి కేరక్టర్ వేయడం కోసం.. సన్నగా మారిపోయి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తర్వాత మళ్లీ లావయిపోయాడు లెడి. అయితే.. పెళ్లైతే ఆ మాత్రం లావవరా ఏంటి అనేసి, అందరి నోళ్లు మూయించేశాడు.

కానీ ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ ప్రతీ సినిమాకి ట్రెండ్ మార్చేస్తున్నాడు. ఇలా మార్చడం మొదలుపెట్టిన దగ్గరనుంచి హిట్స్ కొట్టేస్తున్నాడు. పూరీ డైరెక్షన్ లో వచ్చిన టెంపర్ కోసం.. తొలిసారిగా సిక్ప్ ప్యాక్ చేశాడు యంగ్ టైగర్. ఈ మూవీ అంచనాలను అందుకుని, 40కోట్లకు పైగా కలెక్షన్లతో హిట్ అనిపించుకుంది. రీసెంట్ గా నాన్నకు ప్రేమతో మూవీ కోసం సూపర్బ్ లుక్ ఇచ్చాడు జూనియర్. గెడ్డం పెంచి డిఫరెంట్ లుక్ తో ఆకట్టుకున్నాడు. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచి, ఎన్టీఆర్ కు తొలి 50 కోట్ల సినిమా అయింది.

ఇప్పుడు కొరటాల శివతో కొత్త సినిమా స్టార్ట్ చేశాడు జూనియర్. ఈ సారి కూడా కొత్త ఛేంజ్ చూపించేందుకు జూనియర్ ఫిక్స్ అయ్యాడట. లుక్ తోనే ఫ్యాన్స్ ని థ్రిల్ చేసి, సినిమాని మరింతగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాడట. ఇది యంగ్ టైగర్ కి హ్యాట్రిక్ హిట్ అయ్యే అవకాశం ఉండడంతో.. జాగ్రత్తలు బాగానే తీసుకుంటున్నాడు.