Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్-త్రివిక్రమ్.. అరవింద సమేత రాఘవ

By:  Tupaki Desk   |   19 May 2018 5:19 AM GMT
ఎన్టీఆర్-త్రివిక్రమ్.. అరవింద సమేత రాఘవ
X
ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పై ప్రస్తుత ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికి తెలిసిందే. అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ సినిమా తరువాత త్రివిక్రమ్ నుంచి వస్తున్న సినిమా అయినప్పటికీ క్రేజ్ బాగానే ఉంది. అయితే రేపు ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో చిత్ర యూనిట్ స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ తో పాటు సినిమా టైటిల్ ను కూడా ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది. మొన్నటి వరకు వచ్చిన రూమర్స్ ప్రకారం అయితే టైటిల్ అసామాన్యుడు అని తెలిసింది.

అయితే ప్రస్తుతం వినిపిస్తోన్న టాక్ ప్రకారం అయితే టైటిల్ మరొకటి అని తెలుస్తోంది. దాదాపు 90% అదే అని తెలుస్తోంది. అదేంటి అంటే.. అరవింద సమేత రాఘవ అని తెలుస్తోంది. చిత్ర యూనిట్ నుంచి ఈ టైటిల్ విషయం బయటకు వచ్చినట్లు సమాచారం. అయితే ఇది ఎంతవరకు నిజం అనేది ఈ రోజు సాయంత్రం తేలిపోతుంది. ఫ్యాక్షన్ ఫ్యామిలీ అంశాలతో పాటు మంచి కామెడీ కూడా ఈ సినిమాలో ఉంటుందని ఇదివరకే ఎన్టీఆర్ కొన్ని ఇంటర్వూలలో చెప్పాడు.

ఇక నేడు సాయంత్రం చిత్ర యూనిట్ ఎదో ఒక విషయాన్ని చెప్పేస్తుంది. దాని కోసమే అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ఈ సినిమాలో సరికొత్తగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. హారిక హాసిని ప్రొడక్షన్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.