తారక రాముడు మంచోడు కాదట

Thu May 18 2017 12:44:00 GMT+0530 (IST)

ఈ ఏడాది అందరూ ఎదురుచూస్తున్న తెలుగు సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న జై లవ కుశ కూడా ఒకటి. ఈ మూవీ కథపై చాలానే ఊహాగానాలు వచ్చాయి. ఇందులో ఎన్టీఆర్ ఒక క్లాసిక్ డాన్సర్ గా చేస్తున్నారు అని ఆ మధ్య వార్తలు వినబడ్డాయి. ఇది వాస్తవం కాదట. ఎందుకంటే.. ఈ సినిమా తమిళ్ మూవీ ‘వరలరూ’ కి రీమేక్ కావడమే.

తమిళ్ వర్షన్ లో అజిత్ క్లాసిక్ డాన్సర్ గా కనిపిస్తారు. కానీ దీన్ని ఎన్టీఆర్ ఇమేజ్ కి తగ్గట్టుగా డైరెక్టర్ బాబీ చాలా మార్పులు చేశాడని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రలలో కనిపించబోతున్నాడనే టాక్ ఉంది. ఎంప్లాయీగా.. దొంగగా.. విలన్ గా.. ఇలా తన నట దాహం తీర్చుకొనే ప్రయోగం చేస్తున్నాడు జూనియర్. కొద్ది కాలం కిందట సోషల్ మీడియా లో ప్రోస్తేటిక్ మేకప్ వేసుకొని భయానక మొఖంతో ఒక పిక్ పోస్ట్ చేశాడు ఎన్టీఆర్. ఆ పోస్ట్ తప్ప ఈ సినిమాకు సంబందించి ఇంకా ఏ పోస్టర్ కానీ లుక్ డీటైల్స్ కానీ రాలేదు. ఈ నెల 20న యంగ్ టైగర్ బర్త్ డే సందర్భంగా ఒక రోజు ముందే జై లవ కుశ ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నారు.

ఈ సినిమాను మొదట రవితేజతో చేద్దామని భావించాడు దర్శకుడు. స్క్రిప్ట్ లో మార్పుల కారణంగా తన ఇమేజ్ కు సెట్ కాదనే ఉద్దేశ్యంతో అతను ప్రాజెక్టు నుండి తప్పుకోవడంతో.. ఇది  తారక్ దగ్గరకు చేరింది. జై లవ కుశ ప్రాజెక్టుకి ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. మరి ఈ ఫస్ట్ లుక్ తరవాత అంచనాలు ఎలా పెరుగుతాయో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/