Begin typing your search above and press return to search.

సెన్సేషన్: ఎన్‌ టీఆర్ మూడో రోల్

By:  Tupaki Desk   |   24 Jan 2017 11:55 AM GMT
సెన్సేషన్: ఎన్‌ టీఆర్ మూడో రోల్
X
జనతా గ్యారేజ్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టి టాప్-5లో ప్లేస్ సంపాదించిన జూనియర్ ఎన్టీఆర్.. తర్వాతి ప్రాజెక్టు విషయంలో చాలా కేర్ ఫుల్ గా డెసిషన్ తీసుకున్నాడు. బాబీ డైరెక్షన్ లో వస్తున్న మూవీ.. వరుస హిట్స్ తో ఊపు మీదున్న యంగ్ టైగర్ రేంజ్ ను మరింత పెంచేదిగా ఉండనుందిట. ఈ మూవీకి సంబంధించిన ఓ సెన్సేషన్ పై ఇప్పుడు ఫిలిం నగర్ లో తెగ చర్చలు జరిగిపోతున్నాయి.

కళ్యాణ్ రామ్ నిర్మాతగా.. బాబీ దర్శకత్వంలో వస్తున్న మూవీకి 'జై లవ కుశ' అనే టైటిల్ అనుకుంటున్నారని.. ఇందులో ఎన్టీఆర్ మూడు డిఫరెంట్ రోల్స్ లో నటిస్తున్నాడు. అయితే.. ఇందులో ఒక రోల్ పూర్తిగా నెగిటివ్ షేడ్స్ తోనే ఉంటుందిట. సినిమాకు విలన్ రోల్ ఇదే అంటున్నారు. ఇప్పటివరకూ హీరోయిజాన్ని పండించిన ఎన్టీఆర్.. విలనిజంను ఓ రేంజ్ లో పండించబోతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇందులో నిజానిజాలు ఇంకా తెలియాల్సి ఉన్నా.. పవర్ ఫుల్ విలనిజం పండించే రోల్ కావడంతోనే.. బాబీకి ఈ మూవీ ఛాన్స్ వచ్చిందని అంటున్నారు.

మిగిలిన రెండు రోల్స్ విషయంలో కూడా టాక్ బాగానే వినిపిస్తోంది. వీటిలో ఒకటి అదుర్స్ మాదిరిగా చారి టైపు కేరక్టర్ కాగా.. మరొకటి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ అంటున్నారు. ఒకవేళ విలన్ గా కూడా మెప్పించగలిగితే మాత్రం.. తెలుగులో ఇలాంటి అరుదైన ప్రయోగం చేసిన స్టార్ హీరోగా ఎన్టీఆర్ పేరు రికార్డుల్లోకి ఎక్కేయడం ఖాయం. గతేడాది కోలీవుడ్ హీరో సూర్య.. 24లో ఇలాంటి ప్రయోగమే చేసి సక్సెస్ అయ్యాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/