Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ - సుకుమార్.. బంపర్ క్రేజ్

By:  Tupaki Desk   |   3 Sep 2015 4:18 PM GMT
ఎన్టీఆర్ - సుకుమార్.. బంపర్ క్రేజ్
X
కొన్ని కాంబినేషన్లు అంతే మరి. అంతకుముందు వాళ్ల ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా క్రేజ్ వచ్చేస్తుందంతే. మహేష్ బాబు రెండు వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ.. కొరటాల శివతో జత కట్టేసరికి ‘శ్రీమంతుడు’ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. ఇప్పుడు ఎన్టీఆర్-సుకుమార్ ల సినిమా విషయంలోనూ ఇలాగే జరుగుతోంది. ఈ సినిమా బిజినెస్ ఓ రేంజిలో జరగబోతోందన్న సంకేతాలు వస్తున్నాయి టాలీవుడ్ నుంచి. ఎన్టీఆర్ వరుసగా చాలా ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. ‘టెంపర్’తో ఓ మోస్తరు హిట్టు కొట్టాడు. ఇక సుకుమార్ ‘1 నేనొక్కడినే’ లాంటి డిజాస్టర్ తర్వాత చేస్తున్న సినిమా ఇది. అయినప్పటికీ ఈ కాంబినేషన్ కు మంచి హైపే వచ్చింది. ఇప్పటికే కొన్ని ఏరియాలకు సంబంధించి బయ్యర్లు ఫ్యాన్సీ రేట్లతో కర్చీఫ్ వేసేసినట్లు సమాచారం.

బిజినెస్ సంగతలా ఉంటే.. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఇప్పటికే అమ్ముడై పోయినట్లు సమాచారం. ఎన్టీఆర్ ‘టెంపర్’ మూవీకి మంచి రేటింగ్స్ వచ్చిన నేపథ్యంలో జెమిని టీవీ మరోసారి అతడి సినిమాను సొంతం చేసుకోవాలని ప్రయత్నించి సఫలమైంది. ఆ ఛానెల్ సుకుమార్-ఎన్టీఆర్ సినిమాకు రూ.9 కోట్లకు పైనే ఫ్యాన్సీ రేటు ఇచ్చి శాటిలైట్ రైట్స్ తీసేసుకుందట. ఇది ట్యాక్స్ మినహాయించాక నిర్ణయించిన రేటు. పన్ను కూడా కలిపితే రూ.10.5 కోట్ల దాకా తేలుతుంది. ఎన్టీఆర్ సినిమాల్లో ఇది రికార్డని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బిజినెస్ పరంగానూ ఎన్టీఆర్ కెరీర్లో కొత్త రికార్డులు నెలకొల్పబోతున్నాడనడానికి దీన్ని సూచికగా భావించవచ్చు. 2016 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.