అన్నకు ప్రేమతో ఎన్టీఆర్!!

Tue Jun 12 2018 13:34:19 GMT+0530 (IST)

ఎన్టీఆర్ మూవీ పేరు నాన్నకు ప్రేమతో కదా.. మరి అన్నకు ప్రేమతో అంటారేంటి అనిపించవచ్చు. కానీ రీసెంట్ గా జరిగిన నా నువ్వే ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసిన తర్వాత కచ్చితంగా ఇదే అనిపిస్తుంది. కళ్యాణ్ రామ్-ఎన్టీఆర్ అన్నాదమ్ములు అయినా.. మొదట కాసింత దూరం ఉండేదని.. తర్వాత బంధం బలపడిందని అంటారు.అందుకే జై లవకుశ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ బ్యానర్ కే చేశాడు జూనియర్. అయితే.. కళ్యాణ్ రామ్ కు ఎన్టీఆర్ కు మధ్య పొరపొచ్చాలు వచ్చాయనే టాక్ వచ్చింది. అందుకే కళ్యాణ్ రామ్ మూవీ ఎమ్మెల్యే ప్రచారంలో ఎన్టీఆర్ పాల్గొనలేదని అన్నారు. అయితే.. ఇవన్నీ రూమర్స్ మాత్రమే అని.. రీసెంట్ గా ఎన్టీఆర్ బర్త్ డే ఈవెంట్ సమయంలో.. తమ్ముడికి కళ్యాణ్ రామ్ ఖరీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చినపుడు తేలిపోయింది. ఇప్పుడు నా నువ్వే అంటూ కళ్యాణ్ రామ్ చేసిన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చాడు. అంతే కాదు.. అన్నయ్యతో తన అనుబంధాన్ని పంచుకున్నాడు కూడా.

సినిమాకు ముందు కళ్యాణ్ రామ్ ఎంతో టెన్షన్ పడుతున్నాడని అన్నాడు యంగ్ టైగర్. నాన్నకు ప్రేమతో సమయంలో తాను కూడా ఎంతో టెన్షన్ పడ్డానని.. కానీ ఆ సినిమా తన టెంపర్ సక్సెస్ ను కంటిన్యూ చేసిందని.. ఇప్పుడు కళ్యాణ్ రామ్ పరిస్థితి కూడా సేమ్ అలాగే ఉందని అన్న ఎన్టీఆర్.. కమిట్మెంట్ తో తీసిన సినిమాలు కచ్చితంగా ఆడతాయని అన్నాడు.