Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: తారకరాముడి సింప్లిసిటీ!

By:  Tupaki Desk   |   25 Sep 2018 5:30 AM GMT
ఫోటో స్టొరీ: తారకరాముడి సింప్లిసిటీ!
X
అన్నిటి కంటే విలువైన వస్తువులు ఎప్పుడూ ఫ్రీగా ఉంటాయి. పనికిమాలినవి చాలా కాస్ట్లీ. గాలి లేకుండా ఒక్క నిముషం బతకలేం.. కానీ ఫ్రీ. లేటెస్ట్ మోడల్ స్మార్ట్ ఫోన్ లేకపోయినా.. లగ్జరీ కారు లేకపోయినా జీవితానికి వచ్చే నష్టం ఏమీ ఉండదు. అవి లేకపోతే ఎవ్వరూ చావరు కానీ వాటి ధర ఆకాశంలో ఉంటుంది. ఇక వీటికి సంబంధం లేని మరో టాపిక్ ఏంటంటే సింపుల్ గా ఉండడం. సహజంగా గ్లామర్ ఇండస్ట్రీ లో సింపుల్ గా ఉండడం అనేది సెలబ్రిటీలకు చాలా కష్టం. ఒక్కోసారి వాళ్ళకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక రేంజ్ కి తగ్గట్టు ఉండాల్సిందే అని జనాలు కూడా ఫిక్స్ అయి ఉంటారు. ఇక కొంతమంది సెలబ్రిటీలు వాళ్ళను వాళ్ళు 'డెమిగాడ్స్' అని నిజంగా కూడా ఫిక్స్ అయి ఉంటారు.

కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా అలా నేల మీద కూర్చున్నాడు. 'అరవింద సమేత' షూటింగ్ ఇటలీ లో జరుగుతోందన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ -పూజా హెగ్డే లపై దర్శకుడు త్రివిక్రమ్ డ్యూయెట్ ను ఇటలీ లోని అందమైన లోకేషన్స్ లో తెరకెక్కిస్తున్నాడు. ఇక షూటింగ్ గ్యాప్ ఒక చెట్టు పక్కన కాలేజ్ స్టూడెంట్ పార్కులో కూర్చున్నట్టు సింపుల్ గా కూర్చున్నాడు. లక్షలాది అభిమానులు ఉన్నా.. టాలీవుడ్ లో టాప్ లీగ్ స్టార్ అయినా ఎన్టీఆర్ ఇలా ఒక సాధారణ వ్యక్తి లా కూర్చోవడం అందరిని ఆకర్షిస్తోంది.

ఈ ఫోటో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒకటి అరా హిట్టు వస్తేనే ఎగిరెగిరి పడే నటులు.. ఎంత ఎదిగినా ఎలా ఒదిగి ఉండాలో తారక్ ను చూసి నేర్చుకుంటే ఇండస్ట్రీ బాగుంటుందని నెటిజనులు అంటున్నారు.