ఎన్టీఆర్ ఫోటో కొత్తదా? పాతదా?

Tue Mar 13 2018 17:36:06 GMT+0530 (IST)

జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో జోరు మీద ఉన్నాడు. గతేడాది జై లవ కుశ తో హిట్ అందుకున్న యంగ్ టైగర్ చేతిలో ఇప్పుడు రెండు బడా ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా అయితే మరొకటి రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో నటిస్తున్న మల్టిస్టారర్. త్రివిక్రమ్ సినిమా షూటింగ్ త్వరలో మొదలవనుండగా ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ - చెర్రీతో అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే.రాజమౌళి తో చేయనున్న సినిమా కోసం టెస్ట్ ఫోటోషూట్ కోసం మెగా హీరో తో పాటు లాస్ ఏంజెల్స్ వెళ్ళాడు. కానీ ఈమధ్యనే సోషల్ మీడియా వైరల్ అవుతున్న ఫోటో చూస్తుంటే ఎన్టీఆర్ ఇప్పటికే హైదరాబాద్ తిరిగివచ్చేశాడని జిమ్ లో కసరత్తులు చేసేస్తున్నాడని సందేహాలు వెలువెత్తుతున్నాయి. దానికి కారణం జిమ్ కోచ్ ఎన్టీఆర్ జిమ్ లో ఎక్సర్ సైజ్ చేస్తున్న ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం. ఆ ఫోటో లో త్రివిక్రమ్ సినిమా అంటే ఎన్టీఆర్ 28 వ సినిమాలో లుక్ కోసం కష్టపడుతున్న యంగ్ టైగర్ ఉన్నాడు.

కొందరేమో అమెరికా వెళ్లిన పని అయిపోయిందని తిరిగి వచ్చేసి త్రివిక్రమ్ సినిమాకోసం కసరత్తులు మళ్ళీ మొదలుపెట్టేశాడని అంటున్నారు. మరికొందరు అది ఎప్పటిదో ఫోటో అయ్యుంటుందిలే అని కొట్టిపారేస్తున్నారు. ఇంతకీ ఈ ఫోటో కొత్తదా? పాతదా? అసలు ఎన్టీఆర్ ఎక్కడున్నట్టు?