Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ నుంచి కావాల్సింది.. ఇదే..

By:  Tupaki Desk   |   17 July 2018 9:52 AM GMT
ఎన్టీఆర్ నుంచి కావాల్సింది.. ఇదే..
X
ఓ నటుడికి ఉండాల్సిన అన్ని లక్షణాలు కలిగి ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్. నవరసాలు పండించగల సామర్థ్యం ఆయన సొంతం. ఎన్టీఆర్ లా సమయస్ఫూర్తి, కామెడీ టైమింగ్.. అదే సమయంలో సీరియస్ నెస్ అద్భుతంగా క్యారీ చేయడం ఎవ్వరిలోనూ సాధ్యం కాదు.. తెలుగు హీరోందరిలో బెస్ట్ పర్ ఫామెన్స్ ను ఇచ్చే నటుల్లో ఎన్టీఆర్ ఒకరని టాలీవుడ్ లో చెప్పుకుంటారు. అందుకే ఏరికోరి బిగ్ బాస్ టీం తమ మొదటి సీజన్ లో ఎన్టీఆర్ ను హోస్ట్ గా పెట్టుకుంది. తన వ్యక్తిగత జీవితం, సినిమాల కారణంగా రెండో సీజన్ చేయలేకపోయాడు కానీ.. బిగ్ బాస్ 2లోకి మళ్లీ ఎన్టీఆర్ వస్తే మాత్రం ఆ షో పీక్ స్టేజ్ కి వెళ్లిపోవడం ఖాయమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

బిగ్ బాస్ తో బుల్లితెరపై సందడి చేసిన ఎన్టీఆర్ తాజాగా ల్యాంగ్ గ్యాప్ తర్వాత మరోసారి బుల్లితెరపై తన కామెడీ, సెటైర్లతో వినోదాన్ని పంచాడు. తాజాగా ప్రముఖ చానెల్ లో ప్రసారమవుతున్న ఢీ10 ఫైనల్స్ కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆ షో తాజా ప్రోమో విడుదలైంది.

ఈ ప్రోమోలో ఎన్టీఆర్ షోను తెగ ఎంజాయ్ చేసినట్టు కనిపించింది. సుడిగాలి సుధీర్ కు పంచులేస్తూ.. శేఖర్ మాస్టర్ గుట్టువిప్పుతూ ఎన్టీఆర్ కామెడీతో నవ్వులు పూయించాడు. ఎంతో టైమింగ్ తో చేసిన ఈ కామెడీని అభిమానులు తెగ చూస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఎన్టీఆర్ సందడి చూశాక.. మళ్లీ బుల్లితెర మీదకు ఎన్టీఆర్ రావాలని అభిమానులు కోరుతున్నారు..