Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ జూనియర్.. ఇది ఫేక్ బాసూ

By:  Tupaki Desk   |   16 Jun 2018 6:58 AM GMT
ఎన్టీఆర్ జూనియర్.. ఇది ఫేక్ బాసూ
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కొడుకు పుట్టిన విషయం తెలిసిందే. రీసెంట్ గా ఈ విషయాన్ని యంగ్ టైగర్ కూడా తన అభిమానులతో పంచుకున్నాడు. ఆస్పత్రిలో ఎన్టీఆర్ ఉన్న ఫోటో నెట్ లో కూడా చక్కర్లు కొడుతోంది. అయితే.. ఇదే ఎన్టీఆర్ చిన్న కొడుకు ఫోటో అంటూ నెట్ లో ఓ చిన్నారి పిక్ చక్కర్లు కొడుతోంది.

ముద్దులొలుకుతున్న ఆ పిల్లాడి ఫోటోను.. ఇదే ఎన్టీఆర్ కుమారుడి ఫోటో అంటూ ప్రచారం చేస్తుండడంతో.. జనాలు కూడా ఈజీగానే నమ్మేశారు. రోజుల వయసు ఉన్న పసిబిడ్డ ఫోటో కావడంతో.. నమ్మడానికి ఆస్కారాలు ఏర్పడ్డాయి. అయితే.. అసలు ఇది రియల్ ఫోటో కాదట. ఎవరో ఒక చిన్నారి ఫోటోను పోస్ట్ చేసి.. ఇదే ఎన్టీఆర్ చిన్న కొడుకు ఫోటో అని ట్యాగ్ చేయడంతో.. అక్కడి నుంచి అదే ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకూ అసలు తన కొడుకును ఫోటో తీసేందుకు ఎవరినీ అనుమతించలేదట జూనియర్.

దీంతో ఇది ఫేక్ ఫోటో అనే విషయం అర్ధమయిపోతోంది. అయితే.. ఈ ఫేక్ ఫోటోకు తెగ ప్రచారం జరిగిపోతుండగా.. అప్పుడే పేర్లు కూడా పెట్టేస్తున్నారు కొందరు అభిమానులు. ఎలాగూ తాతయ్య అంటే ఎన్టీఆర్ కు బాగా ఇష్టం. పైగా పెద్ద కొడుకు అభయ్ రామ్ పేరులో కూడా రామ్ ఉంది.. కాబట్టి రామ్ అనే పేరు కలిసి వచ్చేలా పేర్లను కూడా పెట్టేస్తున్నారు నెటిజన్లు.