ఫోటో స్టోరి: పెద్దోడి చేతిలో చిన్నోడు

Mon Jun 18 2018 11:36:31 GMT+0530 (IST)

సోషల్ మీడియా అంటే ఈ రోజుల్లో అందరికి తెలిసిన కామన్ ఫ్లాట్ ఫార్మ్. ఎవరి గురించి తెలుసుకుకోవాలన్న అదే మొదటి పేజీ అవుతోంది. ముఖ్యంగా తారల విషయంలో అయితే సోషల్ మీడియా ముఖ్య పాత్ర పోషిస్తోంది. అభిమానులు అయితే వారి ఇష్టమైన నటీనటుల కోసం సోషల్ మీడియాని తెగ వాడేస్తున్నారు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే ఎన్నో దారులు ఉన్న ఈ సోషల్ మీడియా వరల్డ్ లో ప్రతి దారిలో వెళ్ళడానికి ఒక టైమ్ వస్తుంది.జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇన్స్టాగ్రామ్ దారిని ఎంచుకోవడానికి బలే టైమ్ దొరికింది. గతంలో అల్లు అర్జున్ తన కూతురి మొదటి పుట్టిన రోజు కోసం ఎంచుకున్నట్లు ఇప్పుడు తారక్ కూడా తన రెండవ కుమారుడు జన్మించిన సందర్బంగా ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్ షేర్ చేయడం స్టార్ట్ చేశాడు. పెద్ద కొడుకు అభయ్ చేతిలో చిన్నోడిని ఉంచి తారక్ ఫోటో తీస్తున్నట్లు ఉన్న ఒక ఫోటో మొదటి మూమెంట్ అయ్యింది. షేర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే వేలల్లో లైక్స్ అందాయి.

మొన్నటి నుంచి తారక్ ఇంట్లో రోజు ప్రత్యేక సంబరాలు జరుగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో కుటుంబ సబ్యుల మధ్యన అసలైన వేడుకలకు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి ఆదరణ లభించింది.