త్రివిక్రమ్ కోసం ఎన్టీఆర్ తగ్గుతున్నాడా?

Sat Aug 12 2017 12:48:21 GMT+0530 (IST)

పాత్ర అనుసారం మన హీరోలు బరువు తగ్గడం పెరగడం అనేది ఇప్పుడు సాదారణ విషయంగా మారింది. ఇటువంటి ప్రక్రియలో హింది తమిళ్ నటులు మన హీరోలు కన్నా ముందు ఉన్నారు అనే చెప్పాలి. కానీ ఇప్పుడు ఉన్న  మన స్టార్ యంగ్ హీరోలు అలా చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయటంలేదు. సినిమా సినిమాకు మధ్య గ్యాప్ తక్కువ ఉన్న పర్వాలేదు మేము చేస్తాం అంటున్నారు చేసి చూపిస్తున్నారు. మన హీరోలు అందరికీ దాదాపుగా సిక్స్ ప్యాక్ ఉంది అనే చెప్పాలి. అయితే ఈ మధ్య యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తాజా సినిమా ‘జై లవ కుశ’లో జై పాత్ర కోసం బొద్దుగా మారాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా చివరిదశకు వచ్చిందట.
 
ఈ సినిమా షూటింగ్ ఇంకా మిగిలి ఉంటుండగానే మరో సినిమా కథ విని ఆ సినిమాలో పాత్ర కోసం సన్నబడటం కూడా మొదలుపెట్టాడు ఎన్టీఆర్. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు అని టాక్. ఇప్పటికే కథ స్క్రిప్ట్ ఓకే చేసేశారుoటా. ఈ సినిమాలో హీరో కొంచం స్లిమ్ గా ఉండి ఫిట్ గా కనిపించాలిని చెప్పారంట  డైరెక్టర్ త్రివిక్రమ్. డైరెక్టర్ చెప్పిన సూచనలు మేరకు పాత్రకు తగ్గట్లు మారడం అప్పుడే మొదలుపెట్టేశాడంట ఎన్టీఆర్. జై లవ కుశ సినిమా మరో కొద్ది వరాలలో పూర్తికాబోతుండడంతో నిపుణుల సమక్షంలో జిమ్ చేస్తూ తన డైట్ పై శ్రద్ధ పెట్టాడు అని తెలుస్తుంది. ఈ కొత్త  సినిమా షూటింగ్ కూడా దగ్గరలోనే మొదలుపెట్టే ఆలోచన చేస్తున్నారట. త్రివిక్రమ్ డైరక్షన్లో రాబోతున్న కొత్త సినిమాను వచ్చే వేసవి వినోదంగా అందించడానికి ప్లాన్ చేస్తున్నారట.

కే. యెస్. రవీంద్ర(బాబీ) డైరక్షన్లో వస్తున్న జై లవ కుశ సినిమా ఈ దసరాకు విడుదలకాబోతుంది. ఈ సినిమాను ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కల్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఎన్టీఆర్ త్రీపాత్ర అభినయం చేస్తున్న ఈ సినిమాకు సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.  మూడు పాత్రలో ఒకటైన జై పాత్ర ఇప్పటికే జనాలలోకి చొచ్చుకొనిపోయింది. ఎన్టీఆర్ కూడా ఇప్పుడు ఎక్కడా ఖాళీ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ఇంకా తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో కి హోస్ట్ గా కూడా వ్యహరిస్తున్నాడు. అది సంగతి.