Begin typing your search above and press return to search.

ఈ రాత్రికి స్పెయిన్ వెళుతున్న తార‌క్‌

By:  Tupaki Desk   |   30 Nov 2015 10:16 AM GMT
ఈ రాత్రికి స్పెయిన్ వెళుతున్న తార‌క్‌
X
టెంప‌ర్ త‌ర్వాత ఎన్టీఆర్ కి, 1 నేనొక్క‌డినే త‌ర్వాత సుకుమార్‌ కి ఎంతో కీల‌క‌మైన సినిమా- నాన్న‌కు ప్రేమ‌తో. ఒక‌రు స‌క్సెస్‌ తో జోరుమీదుంటే, వేరొక‌రు ప‌రాజ‌యంతో క‌సిమీద ప‌నిచేస్తున్నారు. ఈ క‌సి నుంచే ఓ కొత్త ప్రొడ‌క్టుని అంతే ఘ‌నంగా ప్రేక్ష‌కాభిమానుల ముందు లాంచ్ చేయాల‌న్న‌ది ప‌ట్టుద‌ల‌. అందుకే అహోరాత్రులు క్ష‌ణం తీరిక లేకుండా శ్ర‌మిస్తున్నారు తార‌క్ అండ్ సుకుమార్‌. ఇప్ప‌టికే ఫ‌స్ట్‌ లుక్ పోస్ట‌ర్‌ - టీజ‌ర్ల‌తో ఆక‌ట్టుకున్నారు.

ఎన్టీఆర్‌ ని మునుపెన్న‌డూ క‌నిపించ‌నంత కొత్త‌గా చూపిస్తున్నాడు సుక్కూ. సింగర్‌ యో యో హ‌నీ సింగ్ గెట‌ప్‌ లో ఎన్టీఆర్ హెయిర్ క‌ట్ యూత్‌ లో పాపుల‌ర్ అయ్యింది ఇప్ప‌టికే. మ‌రి ఇక ముందుంది ముస‌ళ్ల పండుగ‌. ఇప్ప‌టికే సంక్రాంతికి రిలీజ్ చేస్తామ‌ని చెబుతున్నారు. అంటే ఇంకో నెల‌రోజులు మాత్ర‌మే గ‌డువుంది. ఈలోగానే సినిమా మొత్తం పూర్తి చేసి రిలీజ్ చేయాలి. దీనికోసం సుకుమార్ ఇప్ప‌టికే వ‌ర్క్‌ లో స్పీడ్ పెంచాడు. ప్ర‌స్తుతం స్పెయిన్‌ లో కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు. 15 రోజులుగా అక్క‌డ షూటింగ్ న‌డుస్తోంది. అయితే ఇంత‌వ‌ర‌కూ తార‌క్ స్పెయిన్ వెళ్ల‌లేదు. లోక‌ల్ గానే ఉన్నారు.

ఇకపోతే.. టు డే నైట్ విమానం ఎక్కేందుకు రెడీ అవుతున్నాడు. స్పెయిన్‌ లో దిగేయ‌డంతోనే ఆన్‌ లొకేష‌న్ అటెండ్ అయిపోతాడ‌ని అనుకుంటున్నారు. ఇదే చివ‌రి షెడ్యూల్ కాబ‌ట్టి సాధ్య‌మైనంత స్పీడ్‌ గా పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చేస్తూనే ఆడియో లాంచ్‌ కి ప్లాన్ చేస్తున్నారు. ఓ స్టార్ హీరో, ఓ స్టార్ డైరెక్ట‌ర్ ఇద్ద‌రి కెరీర్‌ తో పాటు టాప్ టెక్నీషియ‌న్ల కెరీర్‌ ని శాసించే సినిమా ఇది. ఈ చిత్రానికి దేవీశ్రీ సంగీతం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.