Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ లేటైతే ఎన్టీఆర్ ఏం చేస్తాడు?

By:  Tupaki Desk   |   20 Feb 2017 4:55 AM GMT
త్రివిక్రమ్ లేటైతే ఎన్టీఆర్ ఏం చేస్తాడు?
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ దాదాపు ఎనిమిది నెలల విరామం తర్వాత ముఖానికి రంగేసుకోబోతున్నాడు. బాబీ దర్శకత్వంలో తారక్ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతోంది. ఎన్టీఆర్ మార్చి తొలి వారం నుంచి షూటింగుకి వస్తాడట. ఈ లోపు సినిమా కోసం తారక్ లుక్స్ ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. ఈ చిత్రాన్ని ఐదు నెలల్లో పూర్తి చేయాలని ఎన్టీఆర్ టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఆగస్టులో రిలీజ్ అన్నది ప్రణాళిక. కొంచెం ఆలస్యమైనా సెప్టెంబరుకు సినిమా రిలీజ్ చేసి తీరాలనుకుంటున్నారు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత అనుకోకుండా లాంగ్ గ్యాప్ వచ్చేసిన నేపథ్యంలో ఇకపై అలా గ్యాప్ రాకుండా చూసుకోవాలనుకుంటున్నాడు ఎన్టీఆర్.

అందుకే బాబీ సినిమా ఫైనలైజ్ అవుతున్న టైంలోనే త్రివిక్రమ్ ను కూడా లైన్లో పెట్టాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా సెప్టెంబరులోనే మొదలవుతుందని ఇంతకుముందే ప్రకటించారు. ఐతే ముందు అనుకున్న ప్రకారం త్రివిక్రమ్.. పవన్ కళ్యాణ్ సినిమాను ఈపాటికే మొదలుపెట్టాల్సింది. కానీ ఆలస్యమైంది. ఈ చిత్రం ఏప్రిల్లో కానీ సెట్స్ మీదికి వెళ్లేలా లేదు. పూర్తయ్యేసరికి ఆరు నెలలైనా పడుతుంది. తర్వాత ఎన్టీఆర్ సినిమా స్క్రిప్టు పూర్తి స్థాయిలో రెడీ కావడానికి టైం పడుతుంది. కాబట్టి ఏడాది ఆఖరుకు కానీ త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కలేదేమో. దీంతో మళ్లీ గ్యాప్ వచ్చేస్తే ఎట్లా అని మధ్యలో ఇంకో సినిమా చేస్తే ఎలా ఉంటుందా అని ఎన్టీఆర్ ఆలోచిస్తున్నాడట. ఆ గ్యాప్ ఫిల్ చేసే డైరెక్టర్ కోసం చూస్తున్నాడట. కుదిరితే తనతో సినిమా చేయాలని చాన్నాళ్లుగా కోరుకుంటున్న వినాయక్ కు ఛాన్సివ్వాలని ఎన్టీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. మరి ఎన్టీఆర్ ఫ్రీ అయ్యే సమయానికి వినాయక్ మంచి సబ్జెక్టు రెడీ చేసుకుని అతణ్ని మెప్పిస్తాడేమో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/