Begin typing your search above and press return to search.

రాజమౌళిని వదిలేసిన ఎన్టీఆర్

By:  Tupaki Desk   |   4 Aug 2015 7:41 PM GMT
రాజమౌళిని వదిలేసిన ఎన్టీఆర్
X
డైరెక్టర్లతో పోలిస్తే హీరోలకే కొంచెం ఇగో ఎక్కువుంటుంది. అందులోనూ మన టాలీవుడ్ లో మరీనూ. మనది హీరోస్వామ్య పరిశ్రమ. డైరెక్టర్లు వచ్చి హీరోల్ని అడగాలి కానీ.. హీరోలు డైరెక్టర్లను అడగడం తక్కువే. స్టార్ హీరోల విషయంలో ఎప్పుడూ ఇంతే. ఐతే రాజమౌళితో తనకున్న అనుబంధం దృష్ట్యా.. అలాంటి భేషజాలేమీ చూపించడు ఎన్టీఆర్. ‘ఈగ’ వేదిక మీదే రాజమౌళి తనతో సినిమా చేయకపోవడం గురించి తెగ ఫీలయ్యాడు. ఈగ కారణంగా రాజమౌళికి చాలా ఏళ్లు వృథా అయిపోతున్నాయని.. అది పూర్తి చేసి, ప్రభాస్ తో సినిమా చేసి తన దగ్గరికి ఎప్పుడొస్తాడని సరదాగానే అసహనం వ్యక్తం చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.

ఇప్పుడు ప్రభాస్ తో సినిమా సంగతి కూడా తేలిపోయింది. వచ్చే ఏడాదికి బాహుబలి నుంచి బయటికి వస్తాడు రాజమౌళి. అప్పుడైనా ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందనుకుంటే మహేష్ తో కమిటయ్యాడు. అది పూర్తయ్యేసరికి ఇంకో రెండేళ్లయినా పడుతుంది. ఆ తర్వాత రాజమౌళి కోసం అఖిల్ సహా ఇంకొందరు హీరోలు తయారుగా ఉన్నారు. ఈగ-2 కూడా లైన్లోకి వస్తున్నట్లుంది. రాజమౌళి మహాభారతం గురించి కూడా మాట్లాడుతున్నాడు. మొత్తానికి పరిస్థితి చూస్తుంటే తనతో జక్కన్న సినిమా చేయడం గురించి ఆలోచించడం వృథా అని భావించి ఈ మధ్య రాజమౌళి ఊసే ఎత్తట్లేదట ఎన్టీఆర్. తనంతట తాను వచ్చి సినిమా చేస్తే చూద్దాం అనుకుని.. తన కెరీర్ ను రాజమౌళితో సంబంధం లేకుండా దిద్దుకునే ప్రయత్నంలో ఉన్నాడు తారక్. అందుకే సుకుమార్ తర్వాత కొరటాల, త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్లను లైన్లో పెట్టాడు.