Begin typing your search above and press return to search.

ఆ ఎన్టీఆర్ పేరు.. ఎన్ లవ కుమార్

By:  Tupaki Desk   |   23 March 2017 11:09 AM GMT
ఆ ఎన్టీఆర్ పేరు.. ఎన్ లవ కుమార్
X
'జై లవ కుశ' అంటూ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమాను చేస్తున్నాడు. సర్దార్ సినిమాను తీసిన బాబీ.. ఇప్పుడు కళ్యాణ్‌ రామ్ ప్రొడక్షన్లో ఈ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతోంది.

అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ట్రిపుల్ యాక్షన్ చేస్తున్నాడనే టాక్ ఎప్పటినుండో ఉంది. ఒక రోల్ లో మాత్రం గవర్నమెంట్ ఆఫీసర్ తరహాలో కనిపిస్తాడని ఇవాళ బయటకొచ్చిన ఒక ఫోటోను చూస్తే తెలుస్తోంది. ఫిలిం సిటీ షూటింగ్ స్పాటుకు ఈరోజు హరి కృష్ణ విచ్చేయడంతో.. అక్కడి నుండి ఒక ఫోటో తీసి రిలీజ్ చేశారు ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు. ఆ ఫోటోలో ఎన్టీఆర్ ఎదురుగా ఉన్న నేమ్ ప్లేట్ పైన.. ''ఎన్ లవ కుమార్'' అని రాసుండటం.. మనోడు ''జై లవ కుశ'' టైటిల్ కు ఎంత న్యాయం చేస్తున్నాడో తెలుపుతోంది.

ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేసేలా ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/