Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ తట్టుకోగలరా..?

By:  Tupaki Desk   |   12 Feb 2016 7:30 AM GMT
ఎన్టీఆర్ ఫ్యాన్స్ తట్టుకోగలరా..?
X
రాజమౌళి ప్రస్తుతం 'బహుబలి-2' సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత రాజమౌళి - ఎన్టీఆర్ తో సినిమా చేయాలనే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది మంచి విషయమే కానీ ఇందులో ఒక షాకింగ్ న్యూస్ ఉంది. బాహుబలి తరువాత రాజమౌళి చేయబోయే తదుపరి చిత్రంపై అందరికి అంచనాలు భారీగా ఉంటాయి. రాజమౌళి కూడా సాదా సీదా సినిమాలు తీయడం మానేసిన విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ కూడా రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే ఈ సినిమా భారీ ప్రాజెక్టు కావడం, బాహుబలి సినిమాను మించిన బడ్జెట్ తో చేసే ఇంటర్నేషనల్ ప్రాజెక్టు కావడంతో దాదాపు మూడేళ్ల పాటు షూటింగ్ ఉంటుందని, ఈ సినిమా కోసం ప్రత్యేకంగా శారీరకంగా సన్నద్దం అవ్వాల్సి ఉంటుందని, రెండు మూడేళ్ల పాటు ఇతర సినిమాలు చేయకుండా కేవలం ఇదే ప్రాజెక్టుకు పరిమితం కావాలని చెప్పాడట రాజమౌళి. రాజమౌళిపై నమ్మకంతో ఎన్టీఆర్ సుముఖత వ్యక్తం చేసిట్లు చెబుతున్నారు. మరి తమ అభిమాన హీరో సినిమా కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేయడాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తట్టుకోగలరా..?