Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ హీరోగా కొత్త సాహసం

By:  Tupaki Desk   |   15 Aug 2017 4:59 AM GMT
ఎన్టీఆర్ హీరోగా కొత్త సాహసం
X
హీరోకి ఒక ఇమేజ్ ఉంటుంది డైరెక్టర్ కు ఒక మేకింగ్ స్టైల్ ఉంటుంది. అయితే ఏ హీరో ఏ స్టైల్లో బాగా సెట్ అవుతాడో ఎప్పటికీ చెప్పలేము. మన హీరోలు ఇలా ఎప్పటికైనా కనిపిస్తారా లేదా అలా ఎందుకు చేయరు మన హీరోలు అనే మాటలకు ఇప్పుడు చెక్ పెడుతున్నారు మన యువ హీరోలు. ‘ఐతే’, ‘అనుకోకుండా ఒక రోజు’ - ‘మనమంతా’ - ‘సాహసం’ లాంటి కామన్ కథలను వైవిద్యంగా చెప్పిన రచయత దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఇప్పుడు మొదటిసారి ఒక యంగ్ స్టార్ హీరోను డైరెక్ట్ చేయబోతున్నాడు.

టాలీవుడ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన సినిమాలతో ప్రేక్షకులను తన అభిమానులను ఎప్పటికిప్పుడు కొత్త రుచులను అందిస్తున్నాడు. యాక్షన్ - ఎమోషన్ - కామెడీ ఇలా అన్ని ఉంటూనే బలమైన కథతో అందరినీ ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ ఇప్పుడు మరో కొత్త కథకు ఓకే చెప్పాడు. చంద్ర శేఖర్ యేలేటి ఈ మధ్యనే ఎన్టీఆర్ ను కలిసి ఒక కథ ను వినిపించినట్లు టాక్. ఈ స్టోరీ లైన్ ఎన్టీఆర్ కి బాగ నచ్చి వెంటనే దీన్ని డెవలప్ చేయండి ఇప్పుడు నేను కమిట్ అయన సినిమాలు పూర్తికాగానే స్టార్ట్ చేద్దాం అని చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఇప్పుడు కే.యెస్.రవీంద్ర (బాబీ) డైరక్షన్లో ‘జై లవ కుశ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ అంతా దాదాపుగా పూర్తి అయ్యిందిని తెలుస్తోంది. మరో రెండు పాటలు మాత్రమే చేయవలసి ఉంది అని చెబుతున్నారు ఆ చిత్ర యూనిట్. ఈ సినిమా తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరక్షన్లో ఒక సినిమా మొదలుకానుంది.

త్రివిక్రమ్ సినిమా ముంగించుకొని ఆ వెంటనే చంద్రశేఖర్ యేలేటి సినిమా షూటింగ్ మొదలుపెట్టవచ్చు అని అంటున్నారు. సెప్టెంబర్ 21 నాడు జై లవ కుశ సినిమా విడుదల చేయడానికి అన్నీ సిద్దం చేశారు. త్రివిక్రమ్ సినిమా తరువాత చంద్రశేఖర్ సినిమానే కాకుండా మరో హిట్ డైరెక్టర్ కొరటాల శివ సినిమా కూడా చేయబోతున్నాడు ఎన్టీఆర్. ఇలా తన కొత్త కథలుతో వచ్చే ఏడాది అంతా కొత్త కథలుతో సాహసంగా మన ముందుకు రాబోతున్నాడు.