Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఎవరికి దూరం? ఎవరికి దగ్గర?

By:  Tupaki Desk   |   23 March 2018 10:42 AM GMT
ఎన్టీఆర్ ఎవరికి దూరం? ఎవరికి దగ్గర?
X
ఈ జనరేషన్ స్టార్ హీరోలలో.. మొదటగా స్టార్ స్టేటస్ అందుకున్నది జూనియర్ ఎన్టీఆర్. అయితే.. ఫార్ములా ఫార్మాట్ కు కట్టుబడ్డంతో పాటు.. అప్పట్లో కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఎదురుదెబ్బలు తిన్నాడు. ఎప్పుడైతే ఎన్టీఆర్ నుంచి వచ్చే సినిమాల తీరు మారిందో.. అనతి కాలంలో మళ్లీ టాప్ రేంజ్ కు దూసుకుపోయాడు. యావరేజ్ మూవీతో కూడా భారీ వసూళ్ల రాబట్టగలుగుతున్నాడు.

నిజానికి ఎన్టీఆర్ కు ఈ స్టేటస్ ఎప్పుడో వచ్చి ఉండాలి. అయితే.. ఎన్టీఆర్ కు ఆ స్థాయి ఆలస్యం కావడం వెనుక.. సొంత సామాజిక వర్గమే వ్యతిరేకంగా పని చేయడం కారణం అంటారు పలువురు విశ్లేషకులు. ఎన్టీఆర్ సినిమాలను చూడద్దంటూ రిలీజ్ రోజున బల్క్ మెసేజ్ లు కూడా వెళ్లేవని.. ఇదంతా తెలుగు దేశం పార్టీకి సన్నిహితంగా మెలగకపోవడంతోనే అనే టాక్ కూడా ఉంది. నందమూరి బాలకృష్ణతో పోటాపోటీగా సినిమా రిలీజ్ అయినప్పుడు.. ఇదంతా నిజమే అని అందరూ ఫిక్స్ అయిపోయారు.

ఇప్పటికయితే ఆ పరిస్థితిలో మార్పు రాలేదు. తన సొంత సామాజిక వర్గం నుంచి ఎన్టీఆర్ కొంత వ్యతిరేకతను ఫేస్ చేస్తున్నా.. వైవిధ్యభరిత చిత్రాలతో ఫ్యాన్ బేస్ పెంచుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ మరోసారి అరుదైన ఘనత సాధిస్తున్నాడు. టాప్ స్టేటస్ లో ఉన్న ఇద్దరు హీరోలు కలిసి కనిపించి చేసే మల్టీస్టారర్ లో భాగం అయ్యాడు. ఇప్పటికే కొన్ని మల్టీస్టారర్ లు వచ్చినా రామ్ చరణ్- ఎన్టీఆర్ అంతటి క్రేజీ కాంబో అయితే ఏదీ లేదు.

కానీ ఓ మెగా హీరోతో సినిమా చేయడం అనే పాయింట్.. చాలామందికి ముఖ్యంగా ఎన్టీఆర్ సామాజిక వర్గం వారికి మింగుడుపడ్డం లేదట. అటు సినిమాల పరంగా దశాబ్దాల కాలంగాను.. ఇటు రాజకీయంగా కొంతకాలంగాను మెగా-నందమూరి హీరోల మధ్య విబేధాలున్నాయి. కానీ వీటన్నిటినీ పక్కన పెట్టేసి రామ్ చరణ్ తో సినిమా చేస్తుండడం చాలామందికి మింగుడు పడ్డం లేదట. ఇప్పుడు ఎన్టీఆర్ తీసుకున్న ఈ స్టెప్ కారణంగా.. తన వర్గం వారు మరింత దూరం అవుతారనే విశ్లేషణలు కొట్టి పారేయలేం.

కానీ తమ హీరోతో కలిసి ఓ సినిమా చేస్తే చాలు.. వారిని సుదీర్ఘ కాలం ఆరాధించడం మెగా ఫ్యాన్స్ కు బాగా అలవాటు. ఇప్పుడు ఎన్టీఆర్ అటు దూరమవుతున్నా.. ఇటు మెగా ఫ్యాన్స్ అంటూ ఇంకా పెద్ద బేస్ ను తన వెనుక చేర్చుకుంటున్నాడనే వాదన కూడా స్ట్రాంగ్ గానే కాదు.. లాజికల్ గా కూడా బాగుంది.